భారతదేశపు అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెలు..

First Published Sep 29, 2020, 1:19 PM IST

ఈ రోజుల్లో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుంటున్నారు. నేటి కాలంలో అబ్బాయిలతో  పోటీగా అన్నీ రంగాలలో ముందుకు కొనసాగుతున్నారు. దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెల గురించి ఒకసారి చూద్దాం. వీరిలో బిలియనీర్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా టాప్ లో ఉన్నారు. 
 

దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెలు అందంతో పాటు ఆకర్షణీయమైన జీవనశైలికి ప్రసిద్ది చెందుతూ వ్యాపార రంగంలో కూడా వారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. విరిలో చాలామంది ప్రత్యేక విజయాలను సాధించి ప్రసిద్ది చెందారు. వ్యాపార ప్రపంచంలో అనేక రంగాలలో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించారు.
undefined
ఇషా అంబానీవ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఆమె వ్యాపారంలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. 2008 సంవత్సరంలోనే ఫోర్బ్స్ మ్యాగజైన్ చేత అతి పిన్న వయసులైన బిలియనీర్ వారసుల జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. ఇషా అంబానీ 2014 నుండి రిలయన్స్ జియో డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని కూడా చూసుకుంటుంది. ఆసియా అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళ జాబితాలో ఇషా అంబానీ పేరు కూడా చేర్చారు.
undefined
అనన్య బిర్లాకుమార్ మంగళం బిర్లా పెద్ద కుమార్తె అనన్య బిర్లా. ఆమే సింగర్ గా కెరీర్ ప్రారంభి ఇప్పటివరకు రెండు వ్యాపార సంస్థలను స్థాపించింది.
undefined
తాన్య దుబాష్ఆది గోద్రేజ్ పెద్ద కుమార్తె తాన్య దుబాష్, గోద్రేజ్ గ్రూప్ కంపెనీల బోర్డు డైరెక్టర్లలో సభ్యులుగా కూడా ఉన్నారు. తాన్య దుబాష్ చాలా కాలంగా కుటుంబ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఆమే గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ కూడా. ప్రపంచవ్యాప్తంగా గోద్రేజ్ గ్రూప్ గుర్తింపును నిర్మించడంలో ఆమే కీలకపాత్ర పోషించారు.
undefined
నిసా గోద్రేజ్నిసా గోద్రేజ్ ఆది గోద్రేజ్ చిన్న కుమార్తె. ఈమె వ్యాపార పరిశ్రమలో యువ మేనేజర్‌గా మంచి గుర్తింపు పొందారు. 'టీచ్ ఫర్ ఇండియా' ఫౌండేషన్‌తో పాటు గోద్రేజ్ అగ్రోవెట్, విఐపి ఇండస్ట్రీస్ బోర్డులో నిసా గోద్రేజ్ చైర్‌ పర్సన్‌గా ఉన్నారు.
undefined
వనిషా మిట్టల్లక్ష్మి మిట్టల్ కుమార్తె వనిషా మిట్టల్ భాటియా. ఆమే ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులలో ఒకరు. వనిషా మిట్టల్ ఎల్‌ఎన్‌ఎం హోల్డింగ్స్‌లో డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ఆమె ఏప్రిల్ 2011 లో అపెరామ్‌లో చేరారు మరియు అప్పటి నుండి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పదవిలో ఉన్నారు.
undefined
రోష్ని నాదర్రోష్ని నాదర్ మల్హోత్రా భారత పారిశ్రామికవేత్త శివ్ నాదర్ కుమార్తె. ఆమె హెచ్‌సీఎల్ సీఈఓ. రోష్ని నాదర్ తన తండ్రి శివ నాదర్ ఫౌండేషన్ విద్యా కార్యక్రమాన్ని కూడా చూసుకుంటుంది. భారతదేశంలో లిస్టెడ్ ఐటి కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ. 2019 లో ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె 54 వ స్థానంలో ఉంది.
undefined
పియా సింగ్పియా సింగ్ డిఎల్ఎఫ్ చైర్మన్ కుషల్ పాల్ సింగ్ కుమార్తె. పియా సింగ్ డిఎల్ఎఫ్ రిటైల్ డెవలపర్లతో పాటు డిటి సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
undefined
మనసి కిర్లోస్కర్మనసి కిర్లోస్కర్ బెంగళూరుకు చెందిన విక్రమ్ కిర్లోస్కర్ అనే వ్యాపారవేత్త కుమార్తె. మాన్సీ కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ డిజైన్స్ ఫర్ గ్రోత్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె తన కుటుంబ ఆరోగ్య సంరక్షణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
undefined
లక్ష్మి వేణుసుందరం క్లేటన్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణు. లక్ష్మి వేణు క్లేటన్ జాయింట్ ఎండి. అంతే కాకుండా ఆమే అనేక సామాజిక కార్యకలాపాలలో కూడా పాల్గొంటారు.
undefined
click me!