కూరగాయలు అమ్ముతున్న సుధా మూర్తి.. ఫోటోలు వైరల్‌..

First Published Sep 15, 2020, 1:13 PM IST

దేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి ఆదివారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. సోషల్ మీడియాలో ఆమే ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఆమె కూరగాయలు అమ్ముతు కనిపిస్తుంది. 
 

ఆమే సంవత్సరానికి ఒకసారి అయిన ఇలా కూరగాయలు అమ్ముతున్నట్లు తెలిసింది. అది కూడా ఎక్కడో కురాగాయల మార్కెట్లో కాదు గుడిలో.
undefined
మీరు చూసినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుధ మూర్తి ఫోటో నాలుగు సంవత్సరాల కిందటిది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో శోధిస్తున్నప్పుడు ఈ ఫోటో 2016లోనిది అని తెలిసింది.
undefined
ఆమె ప్రతి సంవత్సరం బెంగుళూరు జయనగర్ లోని తన నివాసం వద్ద ఉన్న రాఘవేంద్ర స్వామి మందిరంలో పనిచేస్తారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు, ఆమే సహచరులతో కలిసి ఆలయ భోజనాల గదులను శుభ్రపరుస్తారు.
undefined
వంటలు చేయడం, కడగడం, అల్మారాలు శుభ్రం చేయడం, కూరగాయల స్టాక్ చూసుకోవడం, వాటిని కడిగి కట్ చేయడం వంటి సేవ పనులను కూడా చేస్తారు. అలాగే కూరగాయలు, బియ్యం వంటి ఆహార పదార్ధాలను ఆలయ స్టోర్ రూమ్‌కు పంపించడంలో సహాయపడతారు.
undefined
ఆలయ ఆపరేటర్ ప్రకారం సుధ మూర్తి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు స్టోర్ రూమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. సుధ మూర్తి కూరగాయల మధ్య నేలమీద కూర్చొనే వాటిని అమ్ముతారు. ఇంకా ఆలయానికి వచ్చే కూరగాయలను కూడా తనిఖీ చేస్తారు.
undefined
ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి 1972లో బివిబి కాలేజిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పట్టభద్రులయ్యారు. బివిబి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేరడానికి ముందు, ప్రిన్సిపాల్స్‌ ఆమెకు మూడు షరతులు పెట్టారు. మొదటిది గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు చీరతో కాలేజీకి హాజరుకావడం.
undefined
రెండవది, కాలేజీ క్యాంటీన్‌కు వెళ్లకపోవడం, మూడవది అబ్బాయిలతో మాట్లాడటం. అయితే, సుధా ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి రెండు షరతులు తప్ప మూడవది పాటించలేదని చెప్పారు. ఆమె మొదటి సంవత్సరంలో కాలేజీలో టాపర్‌గా ఉన్నప్పుడు, అబ్బాయిలందరూ వచ్చి ఆమెతో మాట్లాడేవరట అని అన్నారు.
undefined
click me!