వామ్మో.. టీసీఎస్ కు రూ.53,185 కోట్ల నష్టం! అసలేమైంది?

Published : Feb 25, 2025, 10:00 AM IST

స్టాక్ మార్కెట్ పతనంతో కంపెనీలన్నీ భారీగా కుదేలవుతున్నాయి. తీవ్ర నష్టాలపాలవుతున్నాయి. టాటా గ్రూప్ నకు చెందిన ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు పడిపోవడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ లో రూ.53,185 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ పతనం జీతం పెంపు ప్రక్రియపై ఏదైనా ప్రభావం చూపిస్తుందా అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

PREV
15
వామ్మో.. టీసీఎస్ కు రూ.53,185 కోట్ల నష్టం! అసలేమైంది?
జీతాల పెంపుదలపై ప్రభావం

టాటా గ్రూప్ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన కొత్త పాలసీ, జీతం పెంపు ప్రకటనలు చేయనుంది. ఇండియాలోనే అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ మార్చి 2025లో తన వార్షిక జీతం పెంపును ప్రకటిస్తుంది. ఏప్రిల్ నెలలో ఇది అమల్లోకి వస్తుంది. అంతకుముందు, ఈ వారం కంపెనీ భారీ నష్టాన్ని చవిచూసింది.

25
టీసీఎస్ జీతం పెంపు

ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు 5 రోజుల్లో టీసీఎస్ షేర్లు 2.82 శాతం పడిపోవడంతో, ఒక్క వారంలోనే టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో రూ.53,185.89 కోట్లు నష్టపోయింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,69,717.48 కోట్లుగా ఉంది. కంపెనీ షేర్ ధర రూ.3,789.90 వద్ద ముగిసింది.

35
టీసీఎస్ మార్కెట్ వాల్యుయేషన్

టీసీఎస్ మార్కెట్ వాల్యూయేషన్ లో భారీ పతనంతో టీసీఎస్ భారీ నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో, పోటీదారు ఇన్ఫోసిస్ మార్కెట్ వాల్యూయేషన్ నుంచి రూ.17,086.61 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూయేషన్ రూ.7,53,700.15 కోట్లుగా ఉంది.

45
మార్కెట్ వాల్యుయేషన్ నష్టం

టీసీఎస్ తో సహా మొదటి 10 విలువైన కంపెనీలలో ఎనిమిది కంపెనీల మార్కెట్ వాల్యూయేషన్ రూ.1,65,784.9 కోట్లు పడిపోయింది. ఫిబ్రవరి 21 వారం చివరిలో సెన్సెక్స్ 628.15 పాయింట్లు లేదా 0.82 శాతం పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 133.35 పాయింట్లు లేదా 0.58 శాతం పడిపోయింది.

55
టీసీఎస్ రిటర్న్-టు-ఆఫీస్ (RTO) పాలసీ

దీనికి విరుద్ధంగా, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ రూ.14,547.3 కోట్లు పెరిగి రూ.16,61,369.42 కోట్లకు చేరుకుంది. ఇది అత్యధిక విలువ కలిగిన సంస్థగా కొనసాగుతోంది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 ప్రారంభంలో ప్రవేశపెట్టిన రిటర్న్-టు-ఆఫీస్ (RTO) పాలసీకి అనుగుణంగా టీసీఎస్ జీతం పెంపును త్వరలో అమలు చేయనుంది.

click me!

Recommended Stories