గోల్డ్ ETFలో పెట్టుబడి పెడితే మీరు ఊహించని లాభాలు పొందుతారు

First Published | Nov 14, 2024, 4:56 PM IST

గోల్డ్ ETF(ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్) గురించి మీరు విన్నారా? ఇందులో పెట్టుబడి ఎంత లాభాలనిస్తుందో మీరు ఊహించలేరు. ఇప్పటికే ట్రేడింగ్ చేస్తున్న వారికి ఇది అర్థమవుతుంది. ప్రతి ఏడాది గోల్డ్ ETFలో పెట్టుబడి 16.65% పెరిగింది. గత 3 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. గత 5 ఏళ్లలో గోల్డ్ ETF ఫండ్స్ 14 శాతం కంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయి. గోల్డ్ ETF గురించి మరింత సమచారం ఇక్కడ ఉంది. 

గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడ్ ఫండ్స్

గోల్డ్ ETFలు పెట్టుబడిదారులకు బంగారంతో వచ్చే రాబడితో కూడిన పెట్టుబడి సాధనం. గత 3 సంవత్సరాల్లో గోల్డ్ ETF పెట్టుబడి ఏటా 16.65% పెరిగింది. అదే సమయంలో నగలు, నాణేలు వంటి బంగారం(24-క్యారెట్) కొనుగోలు కూడా 17.05% పెరిగింది. గత 5 సంవత్సరాల రాబడిని చూస్తే గోల్డ్ ETF ఫండ్స్ 14 శాతం కంటే ఎక్కువ లాభాలను ఆర్జించాయి.

గోల్డ్ ETF అంటే ఏమిటి?

స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న ఆర్థిక ఉత్పత్తులు, బంగారం ధరలో మార్పులను ఉపయోగించుకునే అవకాశాన్ని గోల్డ్ ETF మీకు అందిస్తుంది. మీరు గాని గోల్డ్ ETF ఫండ్స్ కొంటే బంగారం ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు. అంటే ధర పెరిగితే లాభాలు, తగ్గితే నష్టాలు కూడా మీరు భరించాల్సి ఉంటుంది. అయితే ఇది లాంగ్ టర్మ్ లో మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. 

SBI గోల్డ్ ఫండ్

ఈ ఫండ్‌లో 1 సంవత్సర రాబడి 26.45%, 3 సంవత్సరాల రాబడి 16.24%, 5 సంవత్సరాల రాబడి 14.19%గా ఉంది. ఈ ఫండ్ 2013 జనవరిలో ప్రారంభమైంది. అప్పటి నుండి 7% రాబడిని ఇచ్చింది. ఇది 0.10% ఖర్చు నిష్పత్తి, రూ. 2,522 కోట్ల AUM కలిగి ఉంది.


LIC MF గోల్డ్ ETF

LIC MF గోల్డ్ ETF ఫండ్‌ సంవత్సరానికి 26.87%, 3 సంవత్సరాల రాబడి 16.65%, 5 సంవత్సరాల రాబడి 14.56% అందిస్తుంది. ఇందులో మీరు పెట్టుబడి పెడితే కచ్చితంగా లాభాలనిచ్చే ఆదాయాన్ని పొందుతారు. ఈ ఫండ్ ప్రారంభం నుండి 6.9% ఆదాయాన్ని ఇచ్చింది. ఇది నవంబర్ 2011లో ప్రారంభమైంది. రూ.151 కోట్ల ఆస్తులు (AUM), 0.41% ఖర్చు నిష్పత్తిని కలిగిన LIC MF గోల్డ్ ETF మీకు మంచి ప్రాఫిట్స్ అందిస్తుంది. 

LIC MF గోల్డ్ ETF FoF

ఈ ఫండ్‌లో 1 సంవత్సర రాబడి 26.72%, 3 సంవత్సరాల రాబడి 16.51%, 5 సంవత్సరాల రాబడి 14.23%. ఈ ఫండ్ ప్రారంభం నుండి 6.62% రాబడిని ఇచ్చింది. జనవరి 1, 2013న ప్రారంభమైన ఈ ETF రూ. 64 కోట్ల AUM, 0.26% ఖర్చు నిష్పత్తి కలిగి ఉంది.

Invesco India గోల్డ్ ETF

Invesco India గోల్డ్ ETF ఫండ్‌లో 1 సంవత్సర రాబడి 27.02%, 3 సంవత్సరాల రాబడి 16.51%, 5 సంవత్సరాల రాబడి 14.27% అందిస్తుంది. ఈ ఫండ్ ప్రారంభం నుండి 6.91% రాబడిని ఇచ్చింది. ఇది రూ.98 కోట్ల AUM, 0.10% ఖర్చు నిష్పత్తిని కలిగి ఉంది.

UTI గోల్డ్ ETF

ఈ ఫండ్‌లో సంవత్సర రాబడి 26.87%, 3 సంవత్సరాల రాబడి 16.25%, 5 సంవత్సరాల రాబడి 14.15%గా ఉంది. ఈ ఫండ్ మార్చి 2017లో ప్రారంభమైంది. అప్పటి నుండి 11.61% రాబడిని ఇచ్చింది. మార్చి 2017లో ప్రారంభమైంది. 0.49% ఖర్చు నిష్పత్తి, రూ.1,440 కోట్ల AUM కలిగి ఉంది.

Axis గోల్డ్ ఫండ్

ఈ గోల్డ్ ETF పెట్టుబడిలో 1 సంవత్సర రాబడి 26.54%, 3 సంవత్సరాల రాబడి 16.29%, 5 సంవత్సరాల రాబడి 14.42%గా ఉంది. ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమైంది. అప్పటి నుండి 6.8% రాబడిని ఇచ్చింది. రూ.699 కోట్ల AUM, 0.17% ఖర్చు నిష్పత్తిని కలిగి ఉంది.

Latest Videos

click me!