పాత 5 రూపాయల కాయిన్స్‌తో బంగ్లాదేశ్‌లో ఏం చేస్తున్నారో తెలుసా?

First Published | Nov 14, 2024, 12:16 PM IST

మీరు గమనించారా? ఈ మధ్య పాత 5 రూపాయల కాయిన్స్ కంటే కొత్త రాగి రంగు నాణేలు పెరుగుతున్నాయి. దీంతో పాత రూ.5 నాణేలు చెల్లవని చాలా మంది అనుకుంటున్నారు. అసలు పాత 5 రూపాయల కాయిన్స్ ఎందుకు తగ్గిపోయాయే మీకు తెలిస్తే షాక్ అవుతారు. అదేవిధంగా కొత్త కాయిన్స్ ఎందుకు విడుదల చేశారో కూడా ఇక్కడ తెలుసుకుందాం రండి. 

ఇండియాలో రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. ఇటీవలే రూ.10 కాయిన్స్ తీసుకోవడానికి మార్కెట్ లో వ్యాపారులు, ప్రజలు కూడా అంగీకరించకపోవడంతో ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ఇక రూ. 20 కాయిన్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. 

మీరు గమనిస్తే ఈ మధ్య అన్ని రకాల కాయిన్స్ ఒకే రకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రూ. 1, రూ. 2 నాణేలకు తేడా తెలియడం లేదు. కాయిన్ మీద ఉన్న నంబర్ ను బట్టి తెలుసుకోవాల్సి వస్తోెంది. ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఏ కాయిన్ అయినా దాని ప్రత్యేకత దానికి ఉండేది. అందువల్ల ఈజీగా గుర్తుపట్టేవారు. 

అయితే ప్రస్తుతం మార్కెట్లో పాత రూ. 5 నాణేల చలామణి తగ్గుతోంది. కొత్త రాగి రంగు రూ. 5 నాణేలు పెరుగుతున్నాయి. దీంతో పాత రూ. 5 నాణేలు చెల్లవని చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఇలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 

పాత రూ. 5 నాణేలు కాస్త పెద్దవి, బరువుగా కూడా ఉంటాయి. వీటిని కూప్రో-నికెల్ అనే ఖరీదైన లోహంతో తయారు చేస్తారు. వీటి బరువు దాదాపు 9 గ్రాములు ఉంటుంది. కానీ కొందరు వీటిని బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ నాణేలను కరిగించి ఇంట్లో ఉపయోగించే చాకులు(నైఫ్) తయారు చేస్తున్నారు. దీని ద్వారా వారు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. 5 రూపాయల కాయిన్స్ తో కత్తులు ఎలా తయారు చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 


ఒక రూ. 5 నాణెంతో ఆరు చిన్న సైజ్ చాకులు తయారు చేయవచ్చు. ఒక్కో దాన్ని రూ. 2కి అమ్ముతారు. కాబట్టి ఒక రూ. 5 కాయిన్ ఉపయోగించి 12 రూపాయలు సంపాదించవచ్చన్న మాట. ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో ఇండియా నుండి చాలా నాణేలు అక్రమంగా తరలిపోతున్నాయి.

ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. దీంతో ఆర్బీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 నాణేల ముద్రణను నిలిపివేసి కొత్త నాణేలను ముద్రించింది. అందుకే మార్కెట్ లో పాత 5 రూపాయల నాణేలు ఎక్కువగా కనిపించడం లేదు. 

కొత్త రూ. 5 నాణేలు తక్కువ మందం, బరువుతో తయారు చేశారు. అంతే కాకుండా చాలా చౌకైన లోహంతో వీటిని తయారు చేయడం ప్రారంభించారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో కొత్త  రూ. 5 నాణేలు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. పాత రూ. 5 కాయిన్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. 

పాత రూ. 5 నాణేల ముద్రణను నిలిపివేయడం ద్వారా అక్రమ నాణేల రవాణాను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద ఎంత పకడ్బందీ చెకింగ్ చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. దీంతో పాత రూ. 5 నాణేల ముద్రణ ఆపేయడమే మార్గమని అధికారులు నిర్ణయించారు. పాత రూ. 5 నాణేల చలామణి తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. 

Latest Videos

click me!