మీకు 15-15-15 ఫార్ములా తెలుసా? త్వరగా రూ.కోటి సంపాదించాలంటే ఇది ఫాలో అయిపోండి

First Published | Nov 14, 2024, 11:22 AM IST

కోటి రూపాయలు సంపాదించాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే సరైన చోట ఇన్వెస్ట్ చేయకపోవడంతో ఫైనాన్సియల్ గా ఇబ్బందులు పడుతుంటారు. అయితే కోటి సంపాదించాలన్న మీ కలను నెరవేర్చాలంటే మ్యూచువల్ ఫండ్స్‌ సరైన మార్గం. తక్కువ సమయంలో కోటి రూపాయల నిధిని సమకూర్చుకోవడానికి 15-15-15 ఫార్ములాను ఉపయోగించండి. ఇలా చేస్తే తక్కువ కాలంలోనే మీరు కోటీశ్వరుడు అయిపోతారు. 

పెట్టుబడిని త్వరగా రెట్టింపు చేసుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ ఆప్షన్ గా ఉపయోగిస్తున్నారు. ఇదేదో మామూలుగా చెబుతున్న మాట కాదు. AMFI అధికారిక డేటా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఫోలియోలు, ఆస్తుల సంఖ్య (AUM) పెరిగినట్లు ఈ డేటా చెబుతోంది. దీన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఎంత ఆదాయాన్ని అందిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

మార్కెట్లో ఎన్నో స్కీమ్ లు ఉన్నాయి. రిస్క్‌ను అంచనా వేసుకొని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌ లో జనం పెట్టుబడులు పెడుతుంటారు. అంతే కాకుండా వారి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్‌ను పెట్టుబడిదారులు ఎంచుకుంటారు. ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ స్వేచ్ఛను ఇస్తుంది. రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా ఫండ్‌లను ఎంచుకోవడానికి కూడా వీలుంది.


షేర్ మార్కెట్ సంబంధిత కొన్ని రిస్క్‌లను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుబడిదారులకు ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఇవి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS), ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) వంటి సాంప్రదాయ పొదుపు పథకాల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తాయి. మీరు చేయాల్సిందల్లా షేర్ మార్కెట్ పై అవగాహన పెంచుకొని రిస్క్ ఫ్యాక్టర్ గురించి మరింత ఎక్కువగా తెలుసుకొని ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిదో తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. 

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు కేవలం 500 రూపాయల నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఆదాయం పెరుగుతున్న కొద్దీ కాలక్రమేణా పెట్టుబడిని కూడా పెంచుకోవచ్చు. దీని ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడిలో భారీ మొత్తంలో కార్పస్‌ను మీరు నిల్వ చేయవచ్చు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కోటి రూపాయలు సంపాదించాలనుకుంటే కొన్ని మంచి ఈక్విటీ ఫండ్‌లను ఎంచుకుని వాటి గత పనితీరును అంచనా వేయాలి. దీన్ని బట్టి భవిష్యత్తును మీరు అంచానా వేయగలుగుతారు. 

ఈక్విటీ ఫండ్స్‌లో 15% వార్షిక రాబడి వస్తుందని అనుకుంటే రూ. 1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి 15 సంవత్సరాలకు SIP పద్ధతిలో నెలకు రూ.15,000 పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి విధానాన్నే 15-15-15 రూల్ అంటారు. ఇది పెట్టుబడిదారులలో బాగా ఫేమస్ అయిన ఫార్ములా. ఈక్విటీ ఫండ్స్ గురించి సరైన అంచనా వేయగలిగి, మీరు 15-15-15 ఫార్ములా ఉపయోగిస్తే కేవలం 15 సంవత్సరాల్లో మీరు కోటీశ్వరులు అవుతారు. 

15 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.15,000 పెట్టుబడి పెట్టి రూ.1 కోటి ఫండ్ పోర్ట్‌ఫోలియో పొందిన తర్వాత మరో 15 సంవత్సరాలకు పెట్టుబడిని కొనసాగించవచ్చు. ఇలా చేస్తే తర్వాత 15 సంవత్సరాలలో 1 కోటి రూపాయలు కాస్త 10 కోట్ల రూపాయలుగా మారిపోతాయి. 15-15-15 నియమాన్ని ఉపయోగించి తెలివిగా పెట్టుబడి పెట్టినప్పుడు మీరు కూడా కోటీశ్వరుడిగా మారవచ్చని ఈ ఫార్ములా రుజువు చేస్తుంది. 

Latest Videos

click me!