1. HAL షేర్ ధర టార్గెట్
బ్రోకరేజ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ భారీగా పెరిగే అవకాశాలున్నాయంటోంది. దీని టార్గెట్ ధర రూ.5,000గా ఇచ్చింది. ఏప్రిల్ 7 ఉదయం 11 గంటల వరకు షేర్ 6.36% పడిపోయి రూ.3,969.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి, రూ.5,675, కనిష్ఠ స్థాయి రూ.3,045.95గా ఉంది.
2. GAIL షేర్ ధర టార్గెట్
ICICI సెక్యూరిటీస్ గెయిల్ షేర్‌ను కొనమని సలహా ఇస్తోంది. దీని టార్గెట్ ధర రూ.245గా ఇచ్చింది. సోమవారం, ఏప్రిల్ 7 ఉదయం 11 గంటల వరకు షేర్ 5.71% పడిపోయి రూ.166.52 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.246.35, కనిష్ఠ స్థాయి రూ.150.60గా ఉంది.
3. పవర్ గ్రిడ్ షేర్ ధర టార్గెట్
బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ పవర్ గ్రిడ్ షేర్‌పై సానుకూలంగా ఉంది. ఈ షేర్ టార్గెట్ ధర రూ.350గా ఇచ్చింది. ఏప్రిల్ 7 ఉదయం 11 గంటల వరకు షేర్ 1.28% తగ్గి రూ.290.15 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.366.20, కనిష్ఠ స్థాయి రూ.247.50గా ఉంది.
4. IREDA షేర్ ధర టార్గెట్
బ్రోకరేజ్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇరెడా షేర్‌ను కొనమని సలహా ఇచ్చింది. దీని టార్గెట్ ధర రూ.196గా ఇచ్చింది. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల వరకు షేర్ 5.72% పడిపోయి 147.50 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.310, కనిష్ఠ స్థాయి రూ.137గా ఉంది.
5. NHPC షేర్ ధర టార్గెట్
HDFC సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్ NHPC షేర్‌ను కొనమని సలహా ఇచ్చింది. 15 రోజుల కోసం దీని టార్గెట్ ధర రూ.89.5గా ఇచ్చింది. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల వరకు షేర్ 1.38% పడిపోయి రూ.81.89 వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: పెట్టుబడి పెట్టే ముందు మీ మార్కెట్ నిపుణుల సలహా తప్పకుండా తీసుకోండి.