ఫిన్‌టెక్, ఈ-కామర్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న మహిళలు స్థాపించిన 5 స్ఫూర్తిదాయకమైన భారతీయ స్టార్టప్‌ల గురించి తెలుసుకోండి.
భారతదేశంలో మహిళా వ్యాపారులు గణనీయంగా పెరుగుతున్నారు. వివిధ రంగాలలో మహిళలు విజయవంతమైన స్టార్టప్‌లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ స్ఫూర్తిదాయకమైన మహిళలు తమ లక్ష్యసాధనలో ఎదరయ్యే అడ్డంకులను బద్దలు కొట్టి, తమ రంగాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వినూత్న పరిష్కారాలతో పరిశ్రమలను ముందుకు సడుపుతున్నారు. ఇలా వ్యాపారరంంపై ప్రభావం చూపిన మహిళా వ్యవస్థాపకులు స్థాపించిన ఐదు ప్రముఖ భారతీయ స్టార్టప్‌ల గురించి తెలుసుకుందాం.
25
Swathi Bhargava - CashKaro
1. స్వాతి భార్గవ - క్యాష్‌కరో (ఫిన్‌టెక్)
స్వాతి భార్గవ భారతదేశంలోనే అతిపెద్ద క్యాష్‌బ్యాక్, కూపన్ ప్లాట్‌ఫారమ్ అయిన క్యాష్‌కరో సహ వ్యవస్థాపకురాలు. 2013లో ప్రారంభించబడిన క్యాష్‌కరో వినియోగదారులకు 1,500 కంటే ఎక్కువ రిటైలర్ల నుండి వారి ఆన్‌లైన్ షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ పొందేందుకు వీలు కల్పిస్తుంది.
35
Upasana Taku - Mobikwik
2. ఉపాసన టాకు - మోబిక్విక్ (ఫిన్‌టెక్)
మోబిక్విక్ సహ-వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ ఉపాసన టాకు భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవానికి నాంది పలికారు. 2009లో స్థాపించబడిన మోబిక్విక్, మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు, డబ్బు బదిలీలు వంటి సేవలను అందించే ప్రముఖ డిజిటల్ వాలెట్, చెల్లింపుల వేదిక.
సరిత అహ్లావత్ రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ రంగంలో అత్యాధునిక స్టార్టప్ అయిన బాట్‌లాబ్ డైనమిక్స్‌కి మేనేజింగ్ డైరెక్టర్, సహ-వ్యవస్థాపకురాలు. బాట్‌లాబ్ డైనమిక్స్ డ్రోన్‌ల రూపొందిస్తుంది.
4. సుచి ముఖర్జీ - లైమెరోడ్ (ఇ-కామర్స్)
సుచి ముఖర్జీ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, హోమ్ డెకార్‌పై దృష్టి సారించే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ లైమెరోడ్ వ్యవస్థాపకురాలు, CEO. 2012లో ప్రారంభించబడిన లైమెరోడ్ దాని ప్రత్యేకమైన షాపింగ్ అనుభవం కోసం విస్తృత ప్రజాదరణ పొందింది.
55
Falguni Nayar - Nykaa
5. ఫాల్గుని నాయర్ - నైకా (బ్యూటీ, లైఫ్‌స్టైల్)
ఫాల్గుని నాయర్, నైకా వ్యవస్థాపకురాలు, CEO, భారతదేశంలో బ్యూటీ, వెల్‌నెస్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 2012లో స్థాపించబడిన నైకా, బ్యూటీ ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రారంభమైంది.