Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు. స్టోరేజ్‌లో టాప్ 5 వెహికల్స్ ఇవే

Published : Mar 05, 2025, 06:29 PM IST

Electric Scooters: స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఎలక్ట్రిక్ కోసం చూస్తున్నారా? ఎక్కువ వస్తువులు పెట్టుకొనేందుకు వీలుగా ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీ అవసరాలకు పర్ఫెక్ట్ గా ఉండే వెహికల్ ని మీరు ఎంచుకోవచ్చు. వాటి ఫీచర్లు, నిల్వ సామర్థ్యం తదితర వివరాలు తెలుసుకుందాం. 

PREV
16
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు. స్టోరేజ్‌లో టాప్ 5 వెహికల్స్ ఇవే

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. సీట్ కింద భాగంలో బ్యాటరీని అమరుస్తారు. దీంతో హెల్మెట్, హ్యాండ్ బ్యాగ్ లాంటి వస్తువులు పెట్టుకోవడానికి చోటు లేక చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేందుకు ఆసక్తి చూపించరు. ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఈవీ ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

 

26

Ather Rizta

ఈ స్కూటర్ అతిపెద్ద అండర్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఏకంగా 34 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. అంటే ఇందులో ఒక షాపింగ్ బ్యాగ్, ఫుల్ హెల్మెట్ ఈజీగా పెట్టొచ్చు. ఇవి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఇతర చిన్న వస్తువులను అడ్జెస్ట్ చేయొచ్చు. దీంతో మీ ప్రయాణం హాయిగా సాగుతుంది. 

36

Bajaj Chetak

చేతక్ స్కూటర్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే దీని స్టోరేజ్ కెపాసిటీ 35 లీటర్లు. ఈ స్కూటర్ సీట్ కూడా పెద్దగా ఉంటుంది. అందువల్ల స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా ఇచ్చారు. ఈ స్కూటర్ ఆడవాళ్లకు బాగా నచ్చుతుంది. ఇందులో హెల్మెట్ తో పాటు ఒక బ్యాగ్ పెట్టుకొనే స్థలం ఉంటుంది. 

46

Ola S1 Pro Plus Gen 3

ఎలక్ట్రిక్ స్కూటర్లలో టాప్ లో ఉన్న ఓలా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీతో S1 Pro Plus జెన్ 3 మోడల్ ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్ 34 లీటర్ల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా అదనపు స్థలం కోసం క్యూబిహోల్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే మరింత స్పేస్ వస్తుంది. 

56

TVS iQube

మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో iQube ఒకటి. ఇది 32 లీటర్ల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో హెల్మెట్ తో పాటు ఒక చిన్న బ్యాగ్ పడుతుంది. లోకల్ గా షాపింగ్ చేసుకొని వస్తువులు తెచ్చుకోవడానికి ఇది కంఫర్ట్‌బుల్ గా ఉంటుంది. 

66

River Indie

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కూటర్లలో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న స్కూటర్ River Indie. ఇది ఏకంగా 43 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. అంటే ఇందులో రెండు హెల్మెట్లు ఈజీగా పడతాయి. అంతేకాకుండా USB ఛార్జర్‌ ఉన్న 12 లీటర్ల లాక్ కెపాసిటీ ఉన్న గ్లోవ్ బాక్స్ కూడా ఉంది. ఈ స్కూటర్ మీకు అన్నివిధాలుగా బాగా ఉపయోగపడుతుంది. 

 

click me!

Recommended Stories