టాటా టియాగో పవర్
ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే 1,199 సీసీ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. కారులో ఉన్న ఈ ఇంజిన్ 6,000 rpmలో 86 bhp పవర్‌ను, 3,300 rpmలో 113 Nm టార్క్ ను అందిస్తుంది. టాటా టియాగో సీఎన్‌జీ కూడా మార్కెట్లో దొరుకుతుంది. టియాగో సీఎన్‌జీ వేరియంట్ లో ఉన్న ఇంజిన్ 6,000 rpm-లో 75.5 పీఎస్ పవర్‌ను, 3,500 rpmలో 96.5 ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది. ఈ కారుకు 242 లీటర్ల బూట్ స్పేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ టాటా కారులో ముందు డిస్క్ బ్రేక్స్, వెనక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం తక్కువ.