ఫాస్టాగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి.?
రహదారులపై టోల్ చెల్లించే సమయంలో వాహనాలు ఎక్కువసేపు వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం వాహనాల అద్దాలపై ఫాస్టాగ్ కార్డును అతికిస్తారు. దీంతో టోల్‌గేట్ ముందు నుంచి వెళ్లగానే టోల్ దానంతటదే అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్ అవుతాయి. కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు దీంతో వీలవుతాయి. ట్యాగ్ స్కాన్ అయినవెంటనే అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అవుతుంది. సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఫాస్టాగ్‌ను మొబైల్ వాలెట్‌లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డ్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.