Honda: హోండా యాక్టివా CNG వెర్షన్‌ వచ్చేస్తోంది.. ఏకంగా 400 కి.మీలు దూసుకెళ్లొచ్చు.

Published : Feb 23, 2025, 12:59 PM IST

పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ టూ వీలర్ కంపెనీలు సీఎన్జీ వేరియంట్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా తాజాగా హోండా యాక్టివా సైతం సీఎన్జీ స్కూటర్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.. 

PREV
14
  Honda: హోండా యాక్టివా CNG వెర్షన్‌ వచ్చేస్తోంది.. ఏకంగా 400 కి.మీలు దూసుకెళ్లొచ్చు.

మైలేజ్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకొని హోండా యాక్టివా సీఎన్జీ స్కూటర్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తక్కువ ధరలోనే ఈ స్కూటీని తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఈ స్కూటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్కూటీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ స్కూటర్ లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

24

హోండా యాక్టివా సీఎన్జీ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్

హోండా యాక్టివా సీఎన్జీలో అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. నెట్టింట ఇందుకు సంబంధించి కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం.. 

డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్

LED హెడ్‌లైట్, LED ఇండికేటర్స్

ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)

ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్

కేవలం మోడ్రన్ లుక్ మాత్రమే కాకుండా భద్రత, సౌకర్యమైన రౌడింగ్ అనుభూతిని అందించేలా ఈ స్కూటీలో ఫీచర్లను అందించనున్నారు. 

34
హోండా యాక్టివా సీఎన్జీ

పర్ఫార్మెన్స్, మైలేజ్

పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, హోండా యాక్టివా సీఎన్జీ శక్తింతమైన ఇంజన్ తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 110సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అందించనున్నారు. ఇది గరిష్టంగా 7.79 బీహెచ్‌పీ పవర్‌ను, 8.17 ఎన్ఎం టార్క్ కెపాసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది.

మైలేజ్ ఈ స్కూట్ ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 320 నుంచి 400 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చని తెలుస్తోంది. ఈ మైలేజ్ పెట్రోల్ వెర్షన్ తో పోల్చితే చాలా ఎక్కువ. 

ధర ఎంత ఉండొచ్చు.? 

ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం మేరకు ఈ స్కూటీ ధర రూ. 85,000 నుంచి రూ. 90,000 ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

44

పర్యావరణ హితంగా ఉండడమే కాకుండా ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ స్కూటీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ప్రతీ రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా ఈ స్కూట్ సెట్ అవుతుంది. త్వరలోనే హోండా ఈ స్కూటీ ధర, ఫీచర్లకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ హోండా యాక్టివా సీఎన్జీ వేరియంట్ ఇండియన్ మార్కెట్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

click me!

Recommended Stories