మన దేశంలో బైక్‌లు, స్కూటర్‌లకు డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి వారే ఎక్కువగా జీవిస్తున్నారు. ప్రజల రోజు వారీ అవసరాలు తీర్చడంలో టూ వీలర్స్ చాలా అవసరం. బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునే చాలా మంది తక్కువ బడ్జెట్‌లోనే కొనాలని ప్రయత్నిస్తుంటారు. మీ బడ్జెట్ రూ. 50,000 లోపు అయితే ఇక్కడ కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలించి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి.
కొమకి ఎక్స్‌జీటీ కెఎం(Komaki XGT KM)
కొమకి ఎక్స్‌జీటీ కెఎం ధర కేవలం రూ.42,500. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే 85 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 25 కి.మీ/గం. ఇది లోకల్ గా పనులు చేసుకొనేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇందులో 60V లిథియం-అయాన్ బ్యాటరీ ఉపయోగించారు. ఇంటర్నల్ అలర్ట్ సిస్టమ్ దీని ప్రత్యేకత. బ్యాటరీ ఛార్జ్ అయిపోతున్నా, ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే ఇంటర్నల్ అలర్ట్ సిస్టమ్ ఇండికేషన్స్ ద్వారా అలర్ట్ చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ కంట్రోల్ అనే రెండు మోడ్ లు ఉన్నాయి. అవసరమైన దాన్ని బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు.