Gold Price : ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి బంగారం ధర ... ఎంతకు చేరుకుందో తెలుసా?

Published : Oct 07, 2024, 05:03 PM ISTUpdated : Oct 07, 2024, 05:35 PM IST

పసిడి పరుగు కొనసాగుతోంది. ఇవాళ మరింత పెరిగిన బంగారం ఆల్ టైమ్ హయ్యెస్ట్ ధర పలికింది. ప్రస్తుతం బంగారం ధర ఎంతకు చేరుకుందంటే...

PREV
14
Gold Price : ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి బంగారం ధర ... ఎంతకు చేరుకుందో తెలుసా?
Today Gold Price

Today Gold Price : బంగారం రోజురోజుకు సామాన్యుడికి దూరమవుతోంది. ఇప్పటికే పరుగు పెడుతున్న పసిడి ధర ఇవాళ(సోమవారం) మరింత పెరిగి ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం రూ.250 పెరిగి రూ.78,700 కు చేరుకుంది. గత శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,450 వుండగా ఇవాళ మరింత పెరిగింది. 


 

24
Today Gold Price

అయితే వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. గత శుక్రవారం మార్కెట్ ముగింపు సమయానికి వెండి ధర రూ.94,200 గా వుంటే నేడు(సోమవారం) అది రూ.94,000 వద్ద స్థిరపడింది. మార్కెట్ పరిస్థితుల కారణంగానే బంగారం దర పెరగ్గా, వెండి ధర తగ్గింది. 

34
Today Gold Price

ఇదిలావుంటే 99.5 శాతం ప్యూరిటీ బంగారం ధర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.78,300 కు చేరుకుంది. గత సెషన్ లో  ఇది రూ.78,100 శాతంగా వుంటే నేడు మరింత పెరిగి రూ.78,300 కు చేరుకుంది.  

44
Today Gold Price

దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడమే బంగారం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈక్విటీ మార్కెట్లలో క్షీణత కూడాబంగారం ధర పరుగుకు కారణమయ్యింది. పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపడం కూడా ఈ ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. 

 
 

click me!

Recommended Stories