Top 10 Biggest Banks in India : ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది..? టాప్ 10 బ్యాంకులు ఏవి..? ఏ బ్యాంక్ మార్కెట్ విలువ ఎంతుంది..? తెలుసుకొండి.
Top 10 Biggest Banks in India : ఈ కాలంలో బ్యాంక్ అకౌంట్ లేనివారు చాలా తక్కువమంది ఉంటారు. డబ్బులు దాచుకోవడం నుండి ప్రభుత్వ పథకాలను పొందే వరకు ప్రతిదానికి బ్యాంక్ అకౌంట్ అవసరం. అందుకే ప్రభుత్వాలు కూడా బ్యాంక్ లను ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. అందుకే దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు డిమాండ్ పెరిగింది.
సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రైవేట్ బ్యాంకులు ముందుంటాయి. అందుకే ఇవి భారీగా కస్టమర్స్ ని కలిగివుండి లక్షలకోట్ల మార్కెట్ క్యాప్ పొందాయి. ఇలా అత్యధిక విలువ కలిగిన టాప్ 10 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
210
1. హెచ్డిఎఫ్సి బ్యాంక్ (HDFC BANK)
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది హెచ్డిఎఫ్సి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో టాప్ 1 గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిచింది. HDFC బ్యాంక్ మార్కెట్ విలువ రూ.14.35 లక్షల కోట్లుగా ఉంది.
310
2. ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI Bank)
Industrial Credit and Investment Corporation of India (ICICI)... ఈ బ్యాంకు భారతదేశంలో రెండో అతిపెద్దది. దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా బ్రాంచెస్, 10 వేలకు పైగా ఏటిఎంలను కలిగివుంది. దీని మార్కెట్ విలువ రూ.9.89 లక్షల కోట్లుగా ఉంది.
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అతిపెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). 1806 లో స్థాపించిన ఈ బ్యాంకును 1955 లోనే జాతీయం చేశారు. ఈ బ్యాంకు లక్షలాదిమంది కస్టమర్లను కలిగివుంది... లక్షల కోట్ల ప్రజాధనం కలిగివుంది. దీని మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.9.61 లక్షల కోట్లుగా ఉంది.
510
4. కొటక్ మహింద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)
దేశంలోని అదిపెద్ద బ్యాంకుల్లో కొటక్ మహింద్రా బ్యాంక్ ఒకటి. ఇది ఆర్థిక రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది. దీని విలువ రూ.4.26 లక్షల కోట్లుగా ఉంది.
610
5. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ కూడా ఉంది. ఇది బ్యాంకింగ్ సర్వీసులతో పాటు ఫైనాన్స్, డిజిటల్ బ్యాకింగ్ సేవలు అందిస్తోంది. దీని విలువ రూ.4.06 లక్షల కోట్లుగా ఉంది.
710
6. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా దేశంలో బాగా ప్రజాధరణ పొందింది. లక్షలాదిమంది కస్టమర్లను కలిగిన ఈ బ్యాంక్ మార్కెట్ విలువ 1.57 లక్షల కోట్లు.
810
7. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)
ఇది ప్రభుత్వరంగ బ్యాంకు... 1969 జాతీయం చేయబడింది. ఈ బ్యాంక్ విలువ ప్రస్తుతం రూ.1.57 లక్షల కోట్లు.
910
8. కెనరా బ్యాంక్ (Canara Bank)
స్వాతంత్య్రానికి ముందే స్థాపించిన బ్యాంకుల్లో కెనరా కూడా ఒకటి. ఈ బ్యాంకును 1906 లో కర్ణాటకలోని మంగళూరులో స్థాపించారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.1.40 లక్షల కోట్లు.
1010
టాప్ 9,10 బ్యాంకులివే..
9. యూనియన్ బ్యాంక్ (Union Bank)
ఇది ప్రభుత్వరంగ బ్యాంక్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రా బ్యాంకును ఇందులోనే విలీనం చేశారు. దీని విలువు రూ.1.35 లక్షల కోట్లు.