మారుతీ సుజుకి బాలెనో, టయోటా గ్లాజా
ఈ రెండు కార్లను మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇవి 1.2-లీటర్, K-సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇది 30.61 కి.మీ మైలేజీ ఇస్తున్నాయి. బాలెనో CNG ధర రూ. 8.40 లక్షల నుండి రూ. 9.33 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, క్లాస్సా బాలెనో కంటే ఇది రూ.25,000 ఎక్కువ.
మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 32.73 మైలేజీ ఇస్తుంది. ఇది 1-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. దీని ధర రూ. 5.91 లక్షల నుండి రూ. 6.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.