ఈ 10 లక్షణాలు ఉంటే మీరూ సీఈవో కావచ్చు

First Published | Aug 20, 2024, 11:37 AM IST

తాను పనిచేసే కంపెనీలో హైపొజిషన్‌కు వెళ్లాలని ప్రతి ఉద్యోగి కలగంటాడు. టాలెంట్‌ను నిరూపించుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటూ ఉంటాడు. అయితే అందరికీ అవకాశాలు తొందరగా రావు.  వచ్చినప్పుడు టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండాలి. ప్రపంచంలో టాప్‌ 10 కంపెనీల సీఈవోలు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నారో మీరూ తెలుసుకొని, అవి అలవాటు చేసుకుంటే మీరూ సీఈవో కావచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి..

వ్యూహాత్మక ఆలోచన(strategic thinking)..

ముఖ్యంగా మార్కెట్‌ ట్రెండ్స్‌ను అర్థం చేసుకోవాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన ప్లానింగ్‌ తప్పనిసరి. ఇది భవిష్యత్తులో మీరు మరో లక్ష్యాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. 

వ్యాపార చతురత(business tactics)
ఫైనాన్సియల్ రిపోర్ట్స్, బడ్జెట్స్ ను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉండాలి. పెట్టుబడి అవకాశాలను కనిపెడుతూ ఉండాలి. ఇలాంటి కీలక విషయాలపై స్మార్ట్ గా ఆలోచించి వేగంగా నిర్ణయం తీసుకోవాలి. 
 

సరైన సమయంలో సరైన నిర్ణయం(decision making)
ఈ పోటీ ప్రపంచంలో వేగంగా అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే చాలా వేగం కరెక్ట్‌ నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. మీ దగ్గర తక్కువ సమాచారమే ఉన్నప్పటికీ దూర దృష్టితో సరైన నిర్ణయం తీసుకోగలగాలి. ఇలా చేయాలంటే మీరు రిస్క్‌ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. 
మార్కెట్ విశ్లేషణ(market analysis)
మార్కెట్లో మీ పోటీదారులు వేస్తున్న అడుగులపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండాలి. వారి ఆలోచనలను అర్థం చేసుకొని వారికంటే బెటర్ ఐడియాలు క్రియేట్ చేయాలి. 
 


సమాచారం చెప్పాలి(good communication)
ఒక వ్యక్తి విజయం సాధించాడంటే అది కేవలం అతని మాత్రమే కాదు. అతనికి సపోర్ట్‌గా నిలిచిన వారందరిదీ..  అంటే టీమ్‌ మెంబర్స్‌ అందరూ కలిసి పనిచేస్తేనే వర్క్‌ పూర్తవుతుంది. దీనికి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం.  టీం మెంబర్స్ తో అవసరమైన అన్ని వివరాలు షేర్ చేసుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యం త్వరగా సాధించవచ్చు. 
ఆర్థిక చతురత(financial tactics)
మీ వ్యాపార బడ్జెట్ కు అవసరమైన పెట్టుబడిని ఏవిధంగా సంపాదించాలన్న అంశంపై మీకు స్పష్టత ఉండాలి. ఇది మీ వ్యాపారం సజావుగా సాగేలా చేస్తుంది. 
 

నాయకత్వం(leadership)
సరైన సమయానికి వర్క్ పూర్తి చేయగలిగితే మార్కెట్లో నిలబడగలుగుతాం. దీనికి మీ టీమ్ ను సరైన దిశగా నడిపించడం చాలా అవసరం. ఇది మీ నాయకత్వ లక్షణాలపైనే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పాటు చేసి మీ టీమ్ సభ్యులు ఒత్తిడి లేకుండా పనిచేసేలా మీరు నాయకత్వం వహించాలి. 
ఎమోషనల్ ఇంటెలిజెన్స్(emotional intelligence)
పనిలో సవాళ్లను ఎదుర్కొనేందుకు మీరు ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. అంటే మీరు మీ భావోద్వేగాలను(ఎమోషన్స్) కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇతరుల ఎమోషన్స్ కు మీరు విలువనివ్వాలి. దీని వల్ల వర్క్ 100 శాతం విజయవంతంగా పూర్తవుతుంది. 
 

సమస్య-పరిష్కారం(problem solving)
మీ వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలకు ప్రధాన కారణాలను గుర్తించడం మిమల్ని సీఈవో చేస్తుందనడంలో సందేహం లేదు. ఆ పరిష్కారాలను సైతం సృజనాత్మకంగా సాల్వ్‌ చేయడం మీకు అలవాటు కావాలి. అంతేకాకుండా వచ్చిన సమస్యలను వ్యూహాత్మకంగా ఆలోచించి పరిష్కరించాలి. 

అనుకూలత(adaptability)
లాంగ్‌ టర్మ్‌ లక్ష్యాలపై దృష్టి ఉండాలి. అంతేకాకుండా మార్పులకు సిద్ధంగా ఉండాలి. వాటిని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్‌ చేసే సత్తా మీలో ఉండాలి. 

Latest Videos

click me!