ఈరోజు శరద్ పూర్ణిమ. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం హిందువులు శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో నేడు బంగారం కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51765 పలుకుతుంటే, వెండి కిలో రూ.60800 పైన అమ్ముడవుతోంది. ఏది ఏమైనప్పటికీ, బంగారం ధర దాదాపు రూ. 4300 మరియు వెండి రూ. 19,000 దాని ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి నుండి తక్కువ ధరకు అమ్ముడవుతోంది.