నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ 10గ్రా., పసిడి ధర ఎంతంటే..?

First Published Jul 29, 2021, 2:51 PM IST

యు.ఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో ఈ రోజు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. నేడు, ఎంసిఎక్స్ లో  గోల్డ్ ఫ్యూచర్స్ 0.39 శాతం అంటే రూ.186 పెరిగి 10 గ్రాములకు రూ.47,763 చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే 1.17 శాతం అంటే రూ. 774 పెరిగి కిలోకు రూ.67164 చేరుకుంది. 

పసుపు లోహం గతేడాది గరిష్ట స్థాయి ( 10 గ్రాములకు 56,200 రూపాయలు) నుండి రూ.8437 తగ్గింది. అయితే భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లచే ప్రభావితమవుతాయని తెలుసుకోవాలి.
undefined
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాములకు రూ.47,761 అమ్ముడైంది, వెండి ధర కిలోకు రూ.66,386. గత రెండు వారాల్లో పసుపు లోహం రూ.700 చౌకగా మారింది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
undefined
నేడు ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. స్పాట్ బంగారం ఔన్సు 0.5 శాతం పెరిగి 1,815.56 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు జూలై 8 నుండి 1,817.35 గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి ఔన్సు 1,815.30 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 9 శాతం పెరిగి ఔన్సు 25.15 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం 0.6 శాతం పెరిగి 2641.69 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 1073.42 డాలర్లకు చేరుకుంది.
undefined
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,330గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230ఉంది.
undefined
కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,810ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,890ఉంది.

gold 

click me!