పాన్ కార్డు విషయంలో ఈ చిన్న తప్పు చేశారంటే పదివేల రూపాయల జరిమానా, జాగ్రత్త

Published : Aug 20, 2025, 01:12 PM IST

పాన్ కార్డు ఎంతో ముఖ్యమైనది. దీనికి సంబంధించి చేసే తప్పులు మిమ్మల్ని శిక్షార్హులను చేస్తాయి. పదివేల రూపాయల జరిమానా కొట్టే అవకాశం కూడా ఉంది. 

PREV
15
పాన్ కార్డు ఎంత ముఖ్యం?

ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు ఇప్పుడు మన జీవితంలో ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. బ్యాంకు ఖాతా తెరవడం దగ్గర నుంచి ఆస్తి కొనుగోలు వరకు ఏ లావాదేవీలు చేయాలన్నా కూడా అక్కడ పాన్ కార్డును చూపించాల్సిందే. అలాగే ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డును కచ్చితంగా పాకెట్ లో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. పాన్ కార్డు ఎంత ముఖ్యమైనదంటే దాని విషయంలో చేసిన చిన్న పొరపాటు కూడా జరిమానాలకు దారితీస్తుంది. పాన్ కార్డును దుర్వినియోగం చేస్తే శిక్ష గట్టిగానే ఉంటుంది. పాన్ కార్డు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.

25
రెండు పాన్ కార్డులు ఉంటే

రెండు పాన్ కార్డులు మీకు ఉన్నాయంటే మీరు కచ్చితంగా 10,000 రూపాయలు జరిమానా పడుతుంది. ఆదాయపు పన్ను శాఖ ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలని సూచిస్తుంది. రెండు పాన్ కార్డులు ఉన్నట్టు తేలితే అతడు నిందితుడితో సమానం. ఇది మీకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న తప్పే మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి మీరు రెండు పాన్ కార్డులు అనుకోకుండా అప్లై చేసి ఉన్నా కూడా ఒక పాన్ కార్డును క్యాన్సిల్ చేయించుకోండి. ఒక పాన్ కార్డును మాత్రమే వాడండి.

35
ఆదాయ సమాచారం కోసమే

పొరపాటున రెండు పాన్ కార్డులు అప్లై చేసుకున్న వారి కూడా ఉంటారు. ఒక పాన్ కార్డు కనిపించకపోవడం వల్ల రెండో పాన్ కార్డుకి అప్లై చేయడం లాంటివి చేస్తారు. దీన్ని ప్రభుత్వం తీవ్రమైన నేరంగానే చెబుతుంది. ఎందుకంటే మీ పాన్ నెంబరు మీ ఆర్థిక చరిత్రతో ముడిపడి ఉంటుంది. రెండు పాన్ నెంబర్లు ఉంటే ప్రభుత్వం మీ సరైన ఆదాయాన్ని, పన్ను సమాచారాన్ని పొందలేదు. అలాగే మీరు ఫారం బ్యాంకు ఖాతా నుంచి ఆర్థిక లావాదేవీల వరకు ఫారం నింపేటప్పుడు ఒక పాన్ నెంబర్ ను మాత్రమే వాడాలి. ఒక్కోసారి ఒక్కోదాన్ని వాడితే సమస్యలు వస్తాయి. దాన్ని ఆదాయపు పన్ను శాఖకు కనబడితే మీకు 10000 జరిమానా వేస్తుంది.

45
పాన్ కార్డులను ఏం చేయాలి?

మీరు రెండు పాన్ కార్డులను పెట్టుకుంటే అది పొరపాటుగా కావచ్చు... లేదా ఉద్దేశపూర్వకంగా కావచ్చు. ఏదైనా కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్లే దానికి శిక్ష తప్పదు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు లేదా ఏదైనా బ్యాంక్ ఫారంలో మీకు తప్పు పాన్ నెంబర్ రాసినా కూడా జరిమానా పడుతుంది. మీ పాన్ కార్డును వేరొకరికి ఇచ్చి దాన్ని దుర్వినియోగం చేస్తే దాని బాధ్యత కూడా మీరే వహించాలి.

రెండు పాన్ కార్డులు ఉంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? జరిమానా, శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఒకదాన్ని రద్దు చేయండి. మీరు ఎప్పుడూ ఒకే పాన్ నెంబర్ ను ఉపయోగించాలి. మీ వ్యక్తిగత పనులకు పాన్ కార్డును ఉపయోగించకండి. దానిని మరెవ్వరికీ ఇవ్వకండి.

55
పాన్ కార్డు అప్డేట్ చేయండి

పాన్ కార్డును తీసుకొని చాలా కాలం అయితే దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా మీ పాన్ కార్డులో పుట్టిన తేదీ, పేరు.. విషయంలో తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు కూడా. ఇందుకోసం మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇన్కమ్ టాక్స్ గవర్నమెంట్ వెబ్ సైట్లోకి వెళితే అక్కడ పాన్ కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అందులో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు రెండు పాన్ కార్డులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి. తర్వాత దాన్ని ఒక దాన్ని రద్దు చేసుకునే విధంగా అభ్యర్థన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు మీద రెండు పాన్ కార్డులో ఉండకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories