అప్పుడు 150 టిష్యూ కల్చర్ చేసిన ఖర్జూర విత్తనాలను తెచ్చి గౌరీబిదనూరులోని ముదగకుంటెలో దివాకర్ కు చెందిన రెండెకరాల భూమిలో నాటాడు. ఇక్కడి వాతావరణం నేల పరిస్థితులు ఖర్జూర పంటలను పండించే విధంగానే ఉండటంతో, ఫలితం లభించిందని దివాకర్ చెన్నప్ప చెప్పారు. మొదటి పంటను పొందడానికి వరుసగా నాలుగు సంవత్సరాలు పట్టింది. ప్రారంభ పంట దాదాపు 800-1,000 కిలోల ఖర్జూరం లభించింది. కానీ ఇప్పుడు నేను సంవత్సరానికి 5 టన్నుల ఖర్జూరాన్ని పండిస్తున్నట్లు దివాకర్ తెలిపారు.