Business Ideas: సూరత్ నుంచి ఒక్క లోడు తెచ్చుకొని మీ ఊరిలో విక్రయిస్తే చాలు, లక్షల్లో లాభం మీ సొంతం...

Published : Oct 17, 2022, 11:23 PM IST

వ్యాపారం చేయడమే లక్ష్యమా అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కొద్దిగా పెట్టుబడి అలాగే తెలివితేటలను జోడిస్తే మీరు చక్కటి వ్యాపారం చేసి లాభాలు పొందవచ్చు వ్యాపార అవకాశాలను తెలుసుకుందాం.

PREV
16
Business Ideas: సూరత్ నుంచి ఒక్క లోడు తెచ్చుకొని మీ ఊరిలో విక్రయిస్తే చాలు, లక్షల్లో లాభం మీ సొంతం...

బట్టల వ్యాపారం పై మంచి ఆదాయం లభిస్తుంది అందరికీ తెలిసిందే ఉత్పత్తి చేసిన వారి కన్నా రిటైల్ అమ్మకం దారులకే ఎక్కువ లాభాలు లభిస్తాయి. అందుకు కారణం లేకపోలేదు ఉత్పత్తిదారులు నేరుగా కస్టమర్ నుంచి చేరుకోలేరు అదే రిటైల్ వ్యాపారులు ఉత్పత్తిని నేరుగా కస్టమర్ కి  ఆకర్షణీయంగా చేరవేస్తారు. అందుకే ఉత్పత్తిదారుడు కన్నా రిటైల్ వ్యాపారులకే లాభాలు ఎక్కువ.
 

26

 ఇక బట్టల విషయానికి  వస్తే,  బట్టలు అనేవి నిత్యవసర వస్తువులే  కానీ బట్టలు అనేవి.  ఆహార పదార్థాల తరహాలో పాడైపోవు.  కొన్ని సంవత్సరాల పాటు వీటిని విక్రయించవచ్చు.  ఇక ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోయే వ్యాపారం విషయానికి వద్దాం.  కిడ్స్ వేర్ వ్యాపారంలో చక్కటి ఆదాయం పొందవచ్చు.  ఎందుకంటే ఇవి  హోల్ సేల్ కన్నా రిటైల్ ధరల ద్వారా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.
 

36

మీరు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి బట్టలను కొనుగోలు చేసి, ఒక షాప్ ద్వారా కానీ,  ఆన్లైన్ ద్వారా కానీ విక్రయిస్తే చక్కటి లాభం పొందవచ్చు.  ముఖ్యంగా కిడ్స్ వేర్ విషయానికి వస్తే న్యూ బోర్న్ బేబీ నుంచి పదేళ్ల పిల్లాడి వరకు అనేక రకాల దుస్తులు లభిస్తాయి వీటినే ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొని విక్రయిస్తే  చక్కటి లాభం పొందే వీలుంది.  ఇందుకోసం మీరు సూరత్ కు  చెందిన గార్మెంట్ మార్కెట్లో అతి తక్కువ ధరకే కిడ్స్ వేర్ లభిస్తుంది. 
 

46

సూరత్ లోని హోల్ సేల్ డీలర్ల వద్ద నుంచి మీరు మీకు కావాల్సిన డిమాండ్ ఉన్న దుస్తులను.  లాట్ రూపంలో తెప్పించుకుని,  మీ నగరం పట్టణం లేదా గ్రామంలో లో విక్రయించవచ్చు వీటిపై దాదాపు 50 నుంచి 70 శాతం వరకు లాభం పొందే వీలుంది.  సరుకును మీరు ట్రాన్స్ పోర్ట్ ద్వారా కూడా సూరత్ నుంచి మీ సమీప ప్రాంతానికి తప్పించుకోవచ్చు. హోల్ సేల్ డీలర్లు,  దేశం నలుమూలల కి ట్రాన్స్ పోర్ట్ చేస్తారు.

56

ఇక మీ ప్రాంతంలో ఒక షాప్ తీసుకొని దాన్ని ప్రత్యేక కిడ్స్ వేర్ షాపు గా మార్చి విక్రయిస్తే చక్కటి వ్యాపారం అవుతుంది. పిల్లల ఛాయిస్ కి తగ్గట్టుగా రెడీమేడ్ వస్త్రాలపై వారి ఫేవరెట్ కార్టూన్ హీరోలు అలాగే కామిక్ హీరో క్యారెక్టర్లను ఉండేలా చూసుకోవాలి బొమ్మలు రంగురంగుల వస్త్రాలు ఉండేలా పిల్లలను ఆకర్షించేలా రెడీమేడ్ వస్త్రాలు ఉండాలి.  అప్పుడే పిల్లలు ఆ వస్త్రాలు వేసుకునేందుకు  ఆసక్తి చూపిస్తారు. 
 

66

పండగ సీజన్లో వస్త్రాలపై డిస్కౌంట్ ఇవ్వడం వల్ల కస్టమర్లు పెద్ద ఎత్తున మీ షాప్ కు వచ్చే అవకాశం ఉంది అలాగే షాప్ డిజైన్ సైతం పిల్లలను ఆకర్షించేలా ఉండాలి.  ఇక ఆన్లైన్ ద్వారా కూడా మీరు వస్త్రాలను విక్రయించవచ్చు ఇందుకోసం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి సైట్లలో రిజిస్టర్ అయి విక్రయించుకోవచ్చు

click me!

Recommended Stories