అంబానీ కుటంబానికి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..

First Published | Dec 29, 2022, 4:30 PM IST

అంబానీ కుటుంబంలో సంబరాల వాతావరణం నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అనంత్ అంబానీ తన స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. రాధికా మర్చంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. 

anant ambani

Anant Ambani Radhika Merchant Engagement: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి నిశ్చయం అయ్యింది. గురువారం రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో తన కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివాహానికి ముందు ఈ ఆలయంలో అంబానీ  కుటుంబ సభ్యులు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం కొందరు  ప్రత్యేక స్నేహితుల సమక్షంలో జరిగింది.

anant ambani

వారం రోజుల క్రితమే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చింది. ఇప్పుడు వారి చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ తో వివాహం జరుపుకోనుండటంతో అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆకాష్, ఇషాలతో పాటు అనంత్ అంబానీ కూడా రిలయన్స్ గ్రూప్‌లో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించడం విశేషం. 

Latest Videos


anant ambani

10 ఏప్రిల్ 1995న జన్మించిన అనంత్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌లో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ కమాండ్‌ని తండ్రి ముఖేష్ అంబానీ అనంత్‌కు అప్పగించారు. ప్రస్తుతం, అతను రిలయన్స్ 02C, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్‌గా ఉన్నారు.

ఫిబ్రవరి 2021లో అనంత్ అంబానీ రిలయన్స్ O2Cకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు, అనంత్‌ను జియో ప్లాట్‌ఫారమ్‌లు మరియు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులో చేర్చారు. అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్శిటీ నుండి తన విద్యను పూర్తి చేసారు. ఇప్పుడు గ్రూప్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో తన పాత్రను పోషిస్తున్నారు.

Image: Viral Bhayani Instagram

సోషల్ మీడియాలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ను అభినందించే ప్రక్రియ కూడా మొదలైంది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమల్ నత్వానీ వారికి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. విశేషమేమిటంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో అత్యంత విలువైన కంపెనీగా ఉంది. అలాగే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17 లక్షల కోట్ల కంటే ఎక్కువ.
 

రాధిక మర్చంట్, డిసెంబర్ 18, 1994న గుజరాతీ కుటుంబంలో జన్మించారు, క్లాసికల్ డ్యాన్సర్‌గా, సెలబ్రిటీ పార్ట్‌నర్‌గా, వ్యాపారవేత్తగా అలాగే మీడియా ముఖంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. మీడియా కథనాల ప్రకారం, రాధిక తన తండ్రి వ్యాపారంలో కూడా సహాయం చేస్తుంది. ఆమె తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త. యాంకర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి CEO, ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. 
 

రాధిక న్యూయార్క్‌లో గ్రాడ్యుయేట్
రాధిక మర్చంట్ న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. నృత్యంపై ఆసక్తితో ఎనిమిదేళ్లుగా భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఇటీవలే రాధిక జియో వరల్డ్ సెంటర్‌లోని గ్రాండ్ థియేటర్ BKC వేదిక ద్వారా అరంగేట్రం చేశారు. 
 

click me!