ఇప్పుడు ఏమి వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా, అయితే ఓ చక్కటి వ్యాపార అవకాశం గురించి తెలుసుకుందాం. స్టేషనరీ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే స్టేషనరీ లో పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులన్నీ లభిస్తాయి. స్టేషనరీ షాపులో వస్తువులు సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇందులో సరుకు పాడైపోయేది ఏమీ లేదు. ఈ సంవత్సరం పుస్తకాలు అమ్ముడుపోకపోతే వాటిని మరో సంవత్సరం కూడా విక్రయించవచ్చు. ఇక స్టేషనరీ షాపులోనే ఓ జిరాక్స్ మిషన్ పెట్టుకుంటే మరింత ఆదాయం పొందే వీలుంది.