అక్టోబర్ నుండి ఈ 5 రూల్స్ మారనున్నాయి: ఆర్థిక, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్‌, వైన్స్ సమాయలో మార్పు..

First Published Sep 29, 2021, 12:24 PM IST

 మరో రెండు రోజుల తర్వాత అంటే 1 అక్టోబర్ 2021 నుండి ఈ ఐదు నియమాలు మారబోతున్నాయి. ఒక విధంగా ఈ నియమాలు మీ రోజు జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు. కొత్త నిబంధనల అమలుతో ఆర్థిక, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్‌కి సంబంధించి మీరు పని చేసే విధానం కూడా మారుతుంది. 

పెన్షన్‌ను కొనసాగించడానికి 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు సర్వైవల్ ప్రూఫ్ సమర్పించాలి. అలాగే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇప్పుడు ఆటో డెబిట్ కోసం కస్టమర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. 
 

1. పెన్షన్: లైఫ్ సర్టిఫికేట్  డాక్యుమెంట్

1 అక్టోబర్ నుండి  80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సదుపాయాన్ని పొందుతారు. దీని కోసం 30 నవంబర్ 2021 వరకు సమయం ఇచ్చారు. సర్టిఫికెట్‌ని దేశంలోని సంబంధిత పోస్టాఫీసు జీవన్ ప్రమాన్ కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. పెన్షనర్ సజీవంగా ఉన్నట్లు లైఫ్ సర్టిఫికేట్ ఒక రుజువుగా పరిగణిస్తారు. పెన్షన్‌ను కొనసాగించడానికి ప్రతి సంవత్సరం పెన్షన్ డ్రా అయిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థలో డిపాజిట్ చేయాలి.

2. ఆటో డెబిట్:

డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఆటో డెబిట్ కోసం ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది ఇందుకు కస్టమర్ల ఆమోదం అవసరం. ఆర్‌బి‌ఐ ఆర్డర్ ప్రకారం 1 అక్టోబర్  2021 నుండి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా మొబైల్ వ్యాలెట్‌లపై రూ .5,000 కంటే ఎక్కువ ఆటో డెబిట్‌ కోసం కస్టమర్‌ల నుండి అడిషనల్ ఫ్యాక్టర్ అతేంటికేషన్ డిమాండ్ చేయాల్సి ఉంటుంది. దీని కింద కస్టమర్ ఆమోదం ఇవ్వకపోతే డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా మొబైల్ వాలెట్ల నుండి ఆటో డెబిట్‌లు జరగవు. ఆమోదం కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు 24 గంటల ముందుగానే ఆటో డెబిట్ మెసేజ్ వినియోగదారులకు పంపాలి. ఆటో డెబిట్ నేరుగా బ్యాంక్ ఖాతా నుండి జరిగితే కొత్త రూల్ ఎలాంటి ప్రభావం చూపదు.
 

3. చెక్ బుక్ తొలగింపు:

మూడు బ్యాంకుల ఖాతాదారులపై ప్రభావం  రెండు రోజుల తర్వాత పాత చెక్ బుక్ ఎం‌ఐ‌సి‌ఆర్ (మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్) అండ్ ఐ‌ఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్)  ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఈ మూడు బ్యాంకుల కోడ్‌లు చెల్లవు. అలహాబాద్ బ్యాంక్ 1 ఏప్రిల్  2020 నుండి ఇండియన్ బ్యాంక్‌లో విలీనం అయ్యింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. ఈ మూడు బ్యాంకుల ఖాతాదారులు సెప్టెంబర్ 30లోపు తాజా చెక్‌బుక్‌లను పొందాలని కోరారు.
 

మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి

4. అసెట్ మేనేజ్మెంట్  కంపెనీలలో పనిచేసే జూనియర్ ఉద్యోగులు గ్రాస్ జీతంలో 10%  మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి. ఎక్స్ఛేంజ్ అండ్ సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) కి సంబంధించి కొత్త నిబంధనలు 1 అక్టోబర్ 2021 నుండి అమలులోకి వస్తున్నాయి. అక్టోబర్ 2023 నుండి అమలయ్యే పెట్టుబడి పరిమాణం 10 నుండి 20 శాతానికి పెంచబడుతుంది. 

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను తెరవడానికి పెట్టుబడిదారుడు ఇప్పుడు అక్టోబర్ 1 నుండి నామినేషన్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ సమాచారాన్ని ఇవ్వకూడదనుకుంటే డిక్లరేషన్ ఫారమ్ నింపడం ద్వారా అతను ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది.

మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ కే‌వై‌సికి సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి డిమాట్, ట్రేడింగ్ ఖాతాదారులకు 30 సెప్టెంబర్ 2021 వరకు సమయం ఇచ్చింది. అప్‌డేట్ చేయకపోతే 1 అక్టోబర్  నుండి ఖాతా నిష్క్రియం అవుతుంది అలాగే ఖాతాదారుడు స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేయలేరు.
 

5.మద్యం దుకాణాలు తెరవబడవు

2021 అక్టోబర్ 1 నుండి 16 నవంబర్ 2021 వరకు ఢిల్లీలో ప్రైవేట్ మద్యం షాపులు తెరవబడవు.  కేంద్రపాలిత ప్రాంతాల ఎక్సైజ్ పాలసీ కింద కొత్త నిబంధన అమలు కానుంది. ఈ కాలంలో ప్రభుత్వ మద్యం షాపులు మాత్రమే తెరిచి ఉంటాయి. ప్రైవేట్ మద్యం షాపులు 17 నవంబర్ 2021 నుండి తిరిగి ప్రారంభమవుతాయి.

click me!