ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వారికి డిసెంబర్ నెలలో ఖర్చులు పెరుగుతాయి. వాస్తవానికి డిసెంబర్ 1 నుండి ఎస్‌బిఐ (SBI) క్రెడిట్ కార్డ్ ఈఎంఐ(EMI)తో కొనుగోలు చేయడం ఖరీదైనదిగా మారానుంది. ప్రస్తుతం ఎస్‌బిఐ కార్డులపై వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నారు. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం, క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన తర్వాత ఈఎంఐ ఆప్షన్ కింద చెల్లింపులు చేయడానికి మీరు ప్రతి కొనుగోలుపై ప్రత్యేకంగా రూ.99 అదనపు ఛార్జీని చెల్లించాలి. ఇది ప్రాసెసింగ్ ఛార్జ్ అవుతుంది. ఈ నియమాన్ని ఎస్‌బిఐ స్వయంగా మొదట ప్రారంభించింది.