ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కూడా సొంత కార్లు లేవు. కనౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆస్తులు రూ.26.34 కోట్లు.
మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆస్తులు రూ.217.21 కోట్లు. అతనికి సొంత కార్లు లేవు. అయితే అతనికి సొంత ట్రాక్టర్ ఉంది.
అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఆమె ఆస్తులు రూ.15 కోట్లు. భర్తలాగే ఆమెకు కూడా కారు లేదు.