మీ దగ్గర చిరిగిన లేదా పాత నోట్లు ఉన్నాయా.. ? అయితే ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి..

First Published | May 15, 2024, 5:32 PM IST

ఇప్పుడు మీ దగ్గర చిరిగిన భారతీయ కరెన్సీ నోటు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని కొత్త కరెన్సీ నోట్లతో ఈజీగా మార్చుకోవచ్చు. కానీ, కొన్ని షరతులు ఉన్నాయి.
 

అప్పుడప్పుడు మనకు తెలియకుండానే చిరిగిన కరెన్సీ నోట్లతో మోసపోతుంటాం. వీటిని ఎక్కడ ఎలా ఎక్స్చేంజ్ చేయాలో చాలా మందికి తెలియదు. అయితే దేశంలోని అన్ని బ్యాంకుల్లో చిరిగిన నోట్లను మార్చుకోవచ్చు. కానీ ఎన్ని కరెన్సీ నోట్లను మార్చుకుంటున్నారనే దానిపై ఆధారపడి నిబంధనలు మారుతూ ఉంటాయి.
 

మురికి లేదా పాడైన నోట్లు లేదా చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి దెబ్బతిన్న కరెన్సీ నోట్లను కౌంటర్లో  మార్చుకోవచ్చు. కరెన్సీ నోట్ల మార్పిడికి చాలా బ్యాంకులు క్యాష్ ఇవ్వడం లేదు. కానీ వాటిని మీ బ్యాంకు అకౌంట్లో  జమ చేస్తారు.
 

Latest Videos


తడిసిన, పాడైన కరెన్సీ నోట్లను కూడా మార్చుకోవచ్చు. కరెన్సీ నోటు రెండు ముక్కలకు మించి చిరిగిపోయినా, ఒక భాగం పోయినా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు.
 

ఈ విధంగా ఒక రోజులో కేవలం 20 నోట్లు లేదా రూ.5,000 విలువగల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. రూ.5000 కంటే ఎక్కువ విలువ గల మార్పిడికి  సర్వీస్ ఛార్జీ విధించబడుతుంది. ఎక్స్చేంజ్ చేయాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే, గుర్తింపు ఫ్రూఫ్ కూడా అవసరం కావచ్చు.
 

కరెన్సీ నోట్లు కాలిపోయినా లేదా బాగా నలిగిపోయినా బ్యాంకులు వాటిని తీసుకోవు,  మార్పిడి చేయవు. కానీ, వాటిని ఆర్‌బీఐకి ఇవ్వడం ద్వారా మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ ఆ కరెన్సీ నోట్లను తీసుకొని వాటిని పరిశీలించి ఎక్స్చేంజ్  చేస్తుంది.
 

torn currency notes, rupees, damaged notes, RBI, Banks, Exchange currency notes, Reserve Bank of India,

బ్యాడ్ కండిషన్ నోట్ల సంఖ్య తక్కువగా ఉంటే, RBI  గుర్తించిన బ్రాంచ్‌లలో కూడా కౌంటర్ ద్వారా మార్పిడి చేసుకోవచ్చు.
 

click me!