Business Ideas: తక్కువ పెట్టుబడితోనే ఉన్న ఊరిలోనే నెలకు లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారాలు ఇవే..

First Published Sep 30, 2022, 12:33 PM IST

చాలా మందికి సొంత వ్యాపారం చేసి సంపాదించాలనే కోరిక ఉంటుంది. పెద్ద నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లోనే వ్యాపారం చేయాలని అనుకుంటారు.  మీరు చిన్న పట్టణంలో స్మార్ట్ వ్యాపారాన్ని  ప్రారంభించవచ్చు. తద్వారా ప్రతి నెల డబ్బు సంపాదించవచ్చు.

తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా, ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. చాలా సార్లు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటారు. అయితే మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి, ఆపై ఎక్కువ రాబడి పొందవచ్చు. . ఈ రోజు మనం ఒక చిన్న పట్టణంలో ప్రారంభించే వ్యాపారాల నుంచి తెలుసుకుందాం. 

చాట్ వ్యాపారం:  చిన్న నగరం లేదా పెద్ద నగరం, గ్రామం లేదా చిన్న పట్టణం కావచ్చు, చాట్‌ తినుబండారాలకు ఈ కాలంలో మంచి  డిమాండ్ ఉంది. సాయంత్రం పూట పానీ పూరీ తినడానికి దాదాపు అందరూ ఇష్టపడతారు. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, పానీ పూరీ, చాట్ తినుబండారాల అమ్మకం వ్యాపారం మంచి ఎంపిక. దీని కోసం మీకు పెద్ద స్థలం లేదా ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. మీరు దీన్ని చిన్న స్థలంలో కూడా చేయవచ్చు. మీరు తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. ఇందుకోసం చాట్ తయారీ మెళకువలు నేర్చుకుంటే సరిపోతుంది.   

స్టేషనరీ లేదా బుక్ స్టోర్ వ్యాపారం: పాఠశాలలు ఉన్న ప్రదేశాలలో, స్టేషనరీ  పుస్తకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, స్టేషనరీ, బుక్‌స్టోర్ వ్యాపారం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు రద్దీగా ఉండే ప్రదేశాలలో దీన్ని తెరవవచ్చు. ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. క్రమంగా మీరు స్టేషనరీని విస్తరించవచ్చు. ప్రింటర్, జిరాక్స్ సర్వీసును ప్రారంభించవచ్చు.

జనరల్ స్టోర్స్: జనరల్ స్టోర్స్ వ్యాపారం కూడా మంచి ఎంపిక. గ్రామాల నుంచి చిన్న పట్టణాల వరకు సరుకుల అవసరం పెరిగింది. ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్ సేవ అందుబాటులో ఉంది. కానీ చిన్న పట్టణాల్లో ఇప్పటికీ జనరల్ స్టోర్స్ లోనే ఎక్కువగా సరుకులు కొంటారు. పప్పు, బియ్యం, సబ్బు, పాలు, బ్రష్, పేస్ట్ మొదలైన రోజువారీ వస్తువులను ప్రతి రోజూ అందుబాటులో ఉంచాలి. మీరు ఈ దుకాణాన్ని తెరిచినప్పుడు మీరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఏమేం నిత్యవసరాలు ఉన్నాయో గుర్తించి సరుకులు షాపులో ఉంచుకోవాలి. 

పూజా సామాగ్రి స్టోర్: పూజా సామాగ్రి ఒకే చోట దొరకడం కష్టం. నగరాల్లో మీరు ఒకే దుకాణంలో అన్ని పూజా వస్తువులను పొందవచ్చు.  ఇలాంటి దుకాణాల సంఖ్య తక్కువ. ఒక్కో వస్తువుకు ఒక్కో దుకాణానికి వెళ్లాలి. ధూపం, దీపం, కలశం సహా పూజ, హోమం, వివాహ వేడుకలకు అవసరమైన అన్ని వస్తువులను ఒకే దుకాణంలో పొందడం కష్టం. కావునా మీరు పూజా సామాగ్రి స్టోర్ తెరిస్తే చక్కటి ఆదాయం పొందే వీలుంది. . 

click me!