పండగకు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వస్తువులు కొంటున్నారా, అయితే ఏవి నకిలీవో, ఏవి అసలైనవో ఇలా తనిఖీ చేయండి...

First Published Sep 29, 2022, 1:07 PM IST

ఆన్‌లైన్ వ్యాపారానికి ఇప్పుడు రిటైల్ వ్యాపారం కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రజలు తమ చేతుల్లో మొబైల్ ఫోన్‌లతో సోఫాలో హాయిగా కూర్చుని, టీ తాగుతూ, ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటూ,  రిటైల్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు.

ఆన్ లైన్  షాపింగ్ వల్ల సమయం, డబ్బు వృధా కావని ప్రజలు భావిస్తున్నారు. అందుకే హాయిగా ఇంట్లో కూర్చుని వస్తువులు కొంటున్నారు. ఆన్‌లైన్‌లో పిన్నీసు నుంచి ఐఫోన్ వరకూ అన్నీ లభిస్తున్నాయి. కొన్ని వస్తువులు చాలా చౌకగా ఉంటాయి. అలాగే, కొన్ని వస్తువులను కొన్ని నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తారు. అందుకే ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. 

అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇంత తక్కువ ధరకు మంచి బ్రాండ్‌ను పొందడం ఎలా సాధ్యమన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. కొనుగోలు సమయంలో, మీరు కొనుగోలు చేస్తున్న ఉత్పత్తి మంచి బ్రాండ్ అవునో, కాదో  మీరు తనిఖీ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆన్‌లైన్ మోసాలను నివారించవచ్చు. మీరు కొనుగోలు చేస్తున్న వస్తువు నిజమైనదా, కాదా అని ఎలా తనిఖీ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి: ప్రస్తుతం తయారీ కంపెనీలు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్నాయి. మీరు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో మీరు కొనే వస్తువు ఉందో లేదో తనిఖీ చేయండి. ఆ వస్తువు అందులో లేకుంటే దానిని కొనకండి.

స్మార్ట్ కన్స్యూమర్ యాప్ ఉపయోగించండి: మీరు FSSAI స్మార్ట్ కన్స్యూమర్ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఇక్కడ మీరు ఉత్పత్తి అసలైనదా లేదా నకిలీదా అని సులభంగా కనుగొనవచ్చు. అనేక ఎలక్ట్రానిక్, FMCG కంపెనీలు ప్రత్యేక QR కోడ్‌లు లేదా హోలోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభించాయి. స్మార్ట్ కన్స్యూమర్ యాప్ సహాయంతో వాటిని స్కాన్ చేయవచ్చు. అప్పుడు ఫలితం మీకే తెలుస్తుంది. 

కస్టమర్ రివ్యూలు చూడండి: ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో, కస్టమర్ రివ్యూలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు వారు ఉపయోగించిన ఉత్పత్తిపై సైటులో రివ్యూలు అందిస్తారు. మీరు కొనుగోలు చేసే ముందు ఈ రివ్యూలను చదవండి. దానికి ఎన్ని స్టార్లు ఇచ్చారో కూడా గమనించండి.

ధరపై శ్రద్ధ వహించండి: సాధారణంగా, అధికారిక వెబ్‌సైట్‌లో ధర తగ్గింపు తక్కువగా ఉంటుంది. చాలా డిస్కౌంట్లు నకిలీవి. కాబట్టి వస్తువులు చౌకగా ఉన్నాయని వాటిని కొనకండి. డీలర్ స్పష్టంగా పేర్కొన్న ఉత్పత్తిని మాత్రమే కొనుగోలు చేయండి.

Health Care-Buying Drugs Online purchasing time mistakes

మెటీరియల్‌తో మోసపోకండి, వాస్తవాలను తెలుసుకోండి: ఉత్పత్తి సరిగ్గా జాబితా చేయబడిందా, లోగో ఎలా ఉందో, QR కోడ్ సరైన స్థలంలో ఉందో లేదో, స్పెల్లింగ్ తప్పుగా ఉందో లేదో తనిఖీ చేయండి. ఇంత చిన్న విషయం ద్వారా ఉత్పత్తి అసలైనదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. కాబట్టి వస్తువు బాగుందని కొనే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి.  

click me!