అక్టోబర్ 1 నుంచి వచ్చే భారీ మార్పులు ఇవే..క్రెడిట్ కార్డు రూల్స్ మార్పు నుంచి గ్యాస్ సిలిండర్ పెంపు వరకూ..

First Published Sep 30, 2022, 4:05 PM IST

అక్టోబర్ 1 నుంచి మీ ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మార్పులు రానున్నాయి ముఖ్యంగా క్రెడిట్ కార్డు జారీ నుంచి డిమ్యాట్ ఎకౌంట్ సిలిండర్ రేటు ఇలా అనేక అంశాల్లో రేపటి నుంచి భారీ మార్పులు రానున్నాయి మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

RBI రెపో రేటు పెంపుతో EMIలు మరింత భారం..

నేడు జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో భాగంగా ఎడ్ల పై కీలక నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకులపై భారం పడనుంది.  తద్వారా బ్యాంకుల నుంచి గృహ వాహన పర్సనల్ లోన్స్ పొందినవారి వడ్డీ రేట్లు పెరగనున్నాయి.  ఫలితంగా  నెల వాయిదా EMI  భారం కానున్నాయి.  ఇక కొత్తగా ఇల్లు కారు లేదా పర్సనల్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేటు 0.5 శాతం పెరగనుంది.  ఇది తక్షణమే రేపటి నుంచి అమల్లోకి రానుంది. 

క్రెడిట్ కార్డు పొందాలంటే ఇకపై ఇది తప్పనిసరి

అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు పొందాలంటే వినియోగదారుల నుంచి ఖచ్చితంగా ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది అప్పుడే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు  సంస్థలు, కార్డు జారీ చేయగలవు.  అలాగే వినియోగదారులు అనుమతిలేకుండా క్రెడిట్ కార్డు లిమిట్ నాకూడా సంస్థలు లేవు అయితే ఈ మార్పులు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకుంది. 

అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులకు షాక్

రేపటి నుంచి ఎవరైతే అటల్ పెన్షన్ యోజన ప్రీమియం చెల్లిస్తూ ఆ పథకం లో కొనసాగుతున్నారు వారికి ఈ వార్త చెప్పాలి ఎందుకంటే పన్ను చెల్లింపుదారులకు అటల్ పెన్షన్ యోజన నుంచి తప్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ఇప్పటివరకు ఎవరైతే పన్ను చెల్లింపుదారులు  ఈ స్కీమ్లో భాగస్వాములయ్యారో  వాళ్లందరి ఖాతాలను బ్లాక్ చేసి, చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేస్తామని కేంద్రం ప్రకటించింది. 

రేపటి నుంచి  Demat అకౌంట్ లో భారీ మార్పులు..

సెబీ జారీ చేసిన రూల్ ప్రకారం  సెప్టెంబర్ 30 లోగా 2 ఫ్యాక్టర్ అథంటికేషన్ అకౌంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో పాటుగా, బయోమెట్రిక్ కూడా తప్పనిసరి చేసింది. 

Mutual Funds

మ్యూచువల్ ఫండ్స్ లో రేపటి నుంచి కొత్త నిబంధనలు ఇవే

ఇకపై మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలంటే నామినేషన్ తప్పనిసరి చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. నామినీ లేకపోవడం వల్ల,  ఇన్వెస్టర్లు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఫండ్ మేనేజర్ హెచ్చరిస్తున్నారు. 

 చిన్న మొత్తాల పొదుపు పై ఇకపై అధిక వడ్డీ

 ఆర్బిఐ రెపో రేటు పెంచినప్పటి నుంచి  ప్రభుత్వం వన్ కొనసాగిస్తున్నారు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అధిక వడ్డీని చెల్లించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది ఇందుకు సంబంధించి రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

గ్యాస్ సిలిండర్ ధర పెరిగే చాన్స్..

ప్రతి నెలా మాదిరిగానే అక్టోబర్ నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే  అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ధరలు పెరుగుతాయా, లేక తగ్గుతాయా అనేది రేపు తెలుస్తుంది. 

click me!