Phone Apps: మనకు చాలా ఉపయోగకరంగా అనిపించే కొన్ని యాప్‌లు మన ఫోన్‌ల నుంచి వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉంది. యూజర్ లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ, ఫోటోలు, మెసేజ్‌లు మొదలైన సమాచారం కూడా లీక్ కావచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
మన వ్యక్తిగత సమాచారం అంతా కూడా స్మార్ట్‌ఫోన్‌లలో ఉండటం సర్వసాధారణం. ప్రైవేట్ ఫోటోలు, వీడియోల నుంచి రహస్య సమాచారం వరకు.. అది ఫోన్‌లోనే స్టోర్ చేస్తాం. మన స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం మనకు తెలియకుండానే లీక్ కావచ్చు. మనం ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్‌లు మన డేటాను దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంది.
25
ఉచిత VPN యాప్‌లు
ఉచిత VPN యాప్‌లు చాలా ప్రమాదకరం కావచ్చు. VPN కనెక్షన్ ఇంటర్నెట్‌ను ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, ఉచిత VPNలు మీ బ్రౌజింగ్ డేటాను వాటి సర్వర్‌లలో నిల్వ ఉంచుతాయి. వీటిని అమ్మి వాళ్లంతా క్యాష్ చేసుకోవచ్చు.
35
అనవసరమైన యుటిలిటీ యాప్‌లు
ఫ్లాష్‌లైట్, క్లీనర్, బూస్టర్ వంటి యాప్‌లు కూడా ప్రమాదమే. అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో అంతర్నిర్మిత ఫ్లాష్‌లైట్ ఉంటుంది. మార్కెట్‌లో థర్డ్-పార్టీ ఫ్లాష్‌లైట్ యాప్‌లు కూడా ఉన్నాయి. ఇవి మీ డేటాను దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఉచిత క్లీనర్ యాప్‌లు మీ ఫోన్‌ను క్లీన్ చేయడంతో పాటు బ్రౌజింగ్ డేటాతో సహా సున్నితమైన సమాచారాన్ని కూడా దొంగిలించగలవని నిపుణులు అంటున్నారు.
ఫేస్ ఫిల్టర్ యాప్‌లు, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ యాప్‌లు ప్రస్తుతం ప్రజాదరణ పొందాయి. ప్రజలు తమ రీల్స్ వీడియోలు, ఫోటోలను సెట్ చేసుకోవడానికి ఇలాంటి యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా మీ ఫేస్ రివీల్ అయ్యి.. వాటి సర్వర్‌లలోకి వెళ్లిపోతాయి.
55
అవసరమైన వాటిని మాత్రమే..
కొన్ని యాప్‌లు ప్రతిదానినీ యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతాయి. ఫోటోలు, ఫోన్ కాల్స్, సెట్టింగ్‌లు, కెమెరా, మెసేజ్‌లు, బ్రౌజింగ్ డేటా మొదలైన వాటిని యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతాయి. ఫోటో ఎడిటింగ్ యాప్‌కి మీ మెసేజ్‌లు ఎందుకు అవసరం? కాబట్టి, యాప్‌లు అనుమతి అడిగినప్పుడు, ప్రతిదీ అనుమతించవద్దు.