నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.58 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసిజి 1-2 శాతంతో నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1-2 శాతం తగ్గాయి.