భారత్ నుంచి బ్రిటీషర్లు దోపిడీ చేసిన సంపద విలువ 328,000 లక్షల కోట్లు..రాయడానికి సున్నాలు సరిపోవేమో..

First Published | Aug 14, 2023, 12:50 PM IST

భారతదేశం సువర్ణ భూమి అని ప్రతి ఒక్కరూ పేర్కొంటారు ఇక్కడి సంపద ప్రపంచంలో మరే దేశంతోను పోటీ పడలేనంతగా ఉందని  చరిత్రకారులు చెబుతున్నారు.  ఈ సంపద కారణంగానే మన దేశం  విదేశీ దండయాత్రల చేతుల్లో ఆక్రమణలకు గురైంది.  ముఖ్యంగా భారతదేశాన్ని బ్రిటీషర్లు దోచుకున్నంతగా మరే ఇతర విదేశీయులు దోచుకోలేదని చరిత్ర మనకు చెబుతోంది. 

మధ్యయుగం నాటి విదేశీ  దండయాత్రలో భారత దేశంలోని బంగారం రత్నాలు వజ్రాలు వంటి విలువైన ఆభరణాలు ఇతర విలువైన వస్తువులను మాత్రమే దోచుకెళ్లేవారు. కానీ బ్రిటీషర్లు మాత్రం భారతదేశంలోని సంపదను గుర్తించి దాదాపు మూడు శతాబ్దాల పాటు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక బద్ధంగా ఈ దేశ సంపదను దోచుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1757లో తొలిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలోని  బెంగాల్ లో తొలిసారి  తన సామ్రాజ్యాన్ని స్థాపించి పన్నుల వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుంది.  అలా ఒక వ్యవస్థీకృత దోపిడీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మన దేశంలోని ప్రజల నుంచి పన్నుల రూపంలోనూ సంపదను  దోచుకుందని  చరిత్రకారులు చెబుతున్నారు. 

If we spend more than we earn, we are ahead

2019లో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్  ఒకానొక సందర్భంలో బ్రిటిష్ వలస పాలకుల చేతిలో భారతదేశం ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా పేర్కొన్నారు నేటి విలువతో అది పోల్చి చూసినట్లయితే దాదాపు 45 ట్రిలియన్ డాలర్లతో సమానమని ఆయన పేర్కొన్నారు నేడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ  పరిమాణం 3.7 ట్రిలియన్ డాలర్లు దీన్నిబట్టి భారతదేశాన్ని బ్రిటిషర్లు ఏ స్థాయిలో దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ఈ మొత్తం నేటి రూపాయి విలువతో పోల్చి చూస్తే 328,000 లక్షల కోట్లుగా తేలింది. 
 


ముఖ్యంగా 1857 నుంచి భారత దేశంలో పూర్తి స్థాయిలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడింది.  అంతకు ముందు ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానంలో నేరుగా బ్రిటన్ రాణి  పరిపాలన సాగించింది.  దాదాపు భారత  ఉపఖండం మొత్తం  బ్రిటన్ సామ్రాజ్యంలో భాగం అయింది.  దీంతో దేశమంతా వ్యవస్థీకృత పన్నుల చట్టాలను అమలు చేసి బ్రిటిషర్లు పన్నులను వసూలు చేసినట్లు తెలుస్తోంది.  బ్రిటన్ సామ్రాజ్యంలోని ఇతర వలస దేశాలతో పోల్చి చూసినట్లయితే భారతదేశ వాటా సింహభాగం ఉండేది. 
 

బ్రిటన్ సాధించిన పారిశ్రామిక విప్లవం వెనుక భారతదేశము వెన్నెముకగా నిలిచింది.  బ్రిటన్ లోని పరిశ్రమలు అన్నింటికీ భారత్ నుంచి ముడి సరుకు అందేది.  ముడి సరుకు అందిన తర్వాత వచ్చిన ఉత్పత్తులను ప్రపంచ దేశాల్లో బ్రిటన్ విక్రయించేది.  అలా బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భారత్ నుంచి లాభం పొందింది
 

బ్రిటన్ భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 2 శతాబ్దాల్లో భారత దేశం తీవ్రమైన పేదరికం, కరువుతో అల్లాడిపోయింది. ఈ రెండు శతాబ్దాల్లో భారతదేశ సంపద క్షీణించింది. భారత్ , బ్రిటన్ మధ్య ఆర్థిక సంబంధాలపై పరిశోధన చేసిన ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ ఇటీవల కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు. బ్రిటిష్ వారు భారతదేశం నుంచి కేవలం కోహినూర్ మాత్రమే కాదు. అంతకన్నా విలువైన భారత ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేశారు. ఇటీవల కొలంబియా యూనివర్శిటీ ప్రెస్‌లో ప్రచురించిన తన వ్యాసంలో పట్నాయక్, భారతదేశం నుండి బ్రిటన్ 45 ట్రిలియన్లకు పైగా నిధులను దోపిడీ చేసిందని పేర్కొన్నారు. ఫలితంగా మన దేశం నేటికీ పేదరికం నుండి బయటపడే  సామర్థ్యాన్ని అడ్డుకుంటోందని పేర్కొన్నారు. 
 

బ్రిటన్ 70 ఏళ్ల క్రితం భారత్‌ను విడిచిపెట్టినప్పటికీ వలసపాలన మచ్చలు అలాగే ఉన్నాయని పట్నాయక్ అన్నారు. "1765 - 1938 మధ్యకాలంలో 45 ట్రిలియన్లు డాలర్ల విలువైన ఎగుమతులను బ్రిటన్ పొందినట్లు ఆమె పేర్కొన్నారు. ఎగుమతుల్లో మిగులు ఆదాయాలను కొలమానంగా తీసుకొని, దానికి 5 శాతం వడ్డీ రేటు కలిపడం వల్ల ఈ లెక్క తేలినట్లు ఆమె పేర్కొన్నారు. 
 

బ్రిటన్ 70 ఏళ్ల క్రితం భారత్‌ను విడిచిపెట్టినప్పటికీ వలసపాలన మచ్చలు అలాగే ఉన్నాయని పట్నాయక్ అన్నారు. "1765 - 1938 మధ్యకాలంలో 45 ట్రిలియన్లు డాలర్ల విలువైన ఎగుమతులను బ్రిటన్ పొందినట్లు ఆమె పేర్కొన్నారు. ఎగుమతుల్లో మిగులు ఆదాయాలను కొలమానంగా తీసుకొని, దానికి 5 శాతం వడ్డీ రేటు కలిపడం వల్ల ఈ లెక్క తేలినట్లు ఆమె పేర్కొన్నారు. 
 

భారతీయులకు బంగారం, ఫారెక్స్ సంపాదన వంటి విలువైన వనరులకు తగిన క్రెడిట్ ఎప్పుడూ ఇవ్వలేదని, ఇవన్నీ బ్రిటీష్ దేశంలోని ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వెళ్లాయని ఆమె అన్నారు. ఉత్సా పరిశోధన ప్రకారం, 1900 నుండి 1945-46 మధ్య కాలంలో దేశ తలసరి ఆదాయం రూ. 196.1 కాగా, 1945-46లో భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక సంవత్సరం ముందు ఇది కేవలం రూ. 201.9 గా ఉందని పేర్కొన్నారు. ఈ కాలంలో తలసరి ఆదాయం 1930-32లో గరిష్టంగా రూ.223.8కి పెరిగింది. 1929కి ముందు మూడు దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక ఎగుమతి మిగులు ఆదాయాలను ఆర్జించిన దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉన్నప్పుడు కూడా దేశ ప్రజల తలసరి ఆదాయం ఇంత కనిష్ట స్థాయిలో ఉందని ఆమె పేర్కొన్నారు. 
 

Latest Videos

click me!