భారత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన రష్యా...ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్

First Published | Aug 14, 2023, 12:32 AM IST

భారత రష్యా అనుబంధం గురించి అందరికీ తెలిసిందే, రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలు ఉన్నాయి. తాజాగా రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తి కాంతదాస్ మాట్లాడుతూ, రష్యా ప్రభుత్వం భారత కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లలో తమ డబ్బులు పెట్టుబడిగా పెట్టిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ఆర్థిక శక్తి ఏ స్థాయిలో ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న రష్యా.. ప్రస్తుతం భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రష్యా ప్రస్తుతం భారత ప్రభుత్వ బాండ్లలో చాలా డబ్బు పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్వయంగా వెల్లడించారు. అయితే ఇది భారత్‌కు ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. ప్రతి రెండు నెలలకోసారి జరిగే రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

భారత ప్రభుత్వ బాండ్లలో రష్యా పెట్టుబడులపై సెంట్రల్ బ్యాంక్ అనవసరంగా ఆందోళన చెందడం లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం అన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీలలో (G-Secs) రష్యన్ కంపెనీల పెట్టుబడుల వివరాలను శక్తి కాంత్ దాస్ పూర్తిగా తెలపకపోయినా, రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు దీర్ఘకాలంగా ఉన్నాయని, నిధుల ఉపసంహరణకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. భారత్‌కు చమురు విక్రయాల ద్వారా రష్యా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెడుతుందని ఈ ఏడాది మేలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. 


మార్కెట్ అంచనాల ప్రకారం ఈ మొత్తం 10–22 బిలియన్ డాలర్ల రేంజులో ఉన్నాయి.  ద్రవ్య విధాన సమీక్ష సమావేశం తర్వాత దాస్ విలేకర్‌తో మాట్లాడుతూ,  ఆందోళన కలిగించే అంశాలు ఏమి లేవని, . మార్కెట్ దాని స్వంత అంచనాలను కలిగి ఉన్నందున మేము అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మాకు సంబంధించినంతవరకు, ఇందులో ఎటువంటి తేడా లేదని తెలిపారు. 

ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నందున, భారతదేశం "ప్రమాదకర స్థితిలో లేదని" అని ఆయన అన్నారు. ఏదైనా దేశంలో లేదా ఏదైనా నిర్దిష్ట సంస్థలో ఆర్‌బిఐ పెట్టుబడులు పెట్టడం గురించి మాట్లాడటం సరికాదని, అయితే అలాంటి పెట్టుబడులు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ లేదా వోస్ట్రో ఖాతా మార్గంలో అనుమతించబడతాయని డిప్యూటీ గవర్నర్ టి రవి శంకర్ తెలిపారు.

Latest Videos

click me!