Tesla Electric Cars: టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై నిషేధం విధించిన చైనా..కారణం ఏంటంటే ?

Published : Jun 21, 2022, 07:02 PM IST

టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు చైనా తీరప్రాంత జిల్లా అయిన బీదైహే(Beidaihe)లోకి ప్రవేశించకుండా నిషేధించబడ్డాయి. జూలై 1 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని స్థానిక ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ చర్య తీసుకోవడానికి గల కారణాలను నిర్ధారించలేదు. 

PREV
14
Tesla Electric Cars: టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై నిషేధం విధించిన చైనా..కారణం ఏంటంటే ?

చైనాలోని సెంట్రల్ సిటీ చెంగ్డూలోని కొన్ని రోడ్లపై టెస్లా కార్లను నడపడం నిషేధించిన కొద్ది వారాల తర్వాత బీదైహె (Beidaihe) పట్టణంలో అధికారులు ఇటీవల ఈ చర్య తీసుకున్నారు. గతంలో, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా చెంగ్డూలోని కొన్ని ప్రాంతాల్లో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను నిషేధించారు.
 

24
అధికారిక ప్రకటన లేదు

బీజింగ్‌కు తూర్పున ఉన్న బీదైహే (Beidaihe) బీచ్ రిసార్ట్‌లో రాబోయే సమ్మర్ పార్టీ కాన్క్లేవ్ సీనియర్ చైనా నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విధానపరమైన ఆలోచనలపై నేతలు చర్చించనున్నారు. ఈ ప్రాంతం నుంచి టెస్లా కార్ల నిషేధాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. పోలీసులు టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను కొన్ని ప్రాంతాల నుంచి దారి మళ్లిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

34
ఇప్పటికే నిషేధించారు

టెస్లా కార్లను చైనా ప్రభుత్వం మిలిటరీ సంచరించే ప్రాంతాల్లో నిషేధించడం కొత్తేమీ కాదు. గత సంవత్సరం, చైనా మిలిటరీ టెస్లా కార్లను తమ ఆధీనంలోని కంటోన్మెంట్ ప్రాంతాలలోకి రాకుండా నిషేధించింది. టెస్లా వాహనాలపై ఉన్న కెమెరాల కారణంగా భద్రతాపరమైన సమస్యలను ఆయన ఉదహరించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆ సమయంలో కంపెనీ వాహనాలు చైనాపై లేదా ప్రపంచంలో మరెక్కడా గూఢచర్యం చేయడం లేదని, అలా చేస్తే తన కంపెనీని ఇప్పుడే మూసివేయాలని అన్నారు.

44

కొన్ని నెలల తరువాత, టెస్లా చైనాలో విక్రయించే కార్ల నుండి ఉత్పత్తి చేయబడిన మొత్తం డేటా దేశంలో నిల్వ చేయబడుతుందని ప్రకటించింది. టెస్లా వాహనాలు దాని వెలుపలి భాగంలో ఇన్‌స్టాల్ చేసిన అనేక బాహ్య కెమెరాలతో ఉంటాయి. పార్కింగ్, లేన్లు మార్చడం ఇతర సౌకర్యాలలో డ్రైవర్లకు సహాయం చేసేందుకు ఈ కెమెరాలను ఫిక్స్ చేశారు. అయితే, ఈ కెమెరాలతో, కారు చుట్టూ ఏమి జరుగుతుందో కూడా రికార్డ్ చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories