మీకు జీతంతో కూడిన సెలవులు ఎప్పుడు లభిస్తాయి
మీషో అధికారుల ప్రకారం, కొత్త సెలవు విధానం ప్రకారం ఉద్యోగులు తీవ్రమైన అనారోగ్యం విషయంలో 365 రోజుల వేతనంతో కూడిన సెలవు తీసుకోగలరు. కంపెనీకి చెందిన ఉద్యోగి లేదా అతనికి సన్నిహితంగా ఉన్న ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే వారు ఈ పాలసీని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, ఉద్యోగి పై చదువులు లేదా వ్యక్తిగత పనుల కోసం కూడా సెలవు తీసుకోవచ్చు. ఉద్యోగి స్వయంగా అనారోగ్యానికి గురైతే, ఆ సంవత్సరం సెలవులో అతనికి పూర్తి జీతం లభిస్తుందని కంపెనీ తెలిపింది. మరోవైపు, కుటుంబంలోని ఎవరైనా అనారోగ్యానికి గురైతే మూడు నెలలకు 25 శాతం జీతం చెల్లిస్తారు.