మామూలుగా టీ దుకాణంలో ఒక టీ రూ.10 ఉంటుంది. అయితే కేవలం పది రూపాయలతో ఇంత బిజినెస్ చేయొచ్చా? ఈ సందేహం మీకూ వచ్చిందా? కచ్చితంగా చేయొచ్చు అంటున్నాడు 'శర్మ కేఫ్ రెస్టారెంట్' (Sharma Cafe Restaurant) ఓనర్. ఈ టీ కొట్టు ద్వారా నెలకు సుమారు రూ.9 లక్షల ఆదాయం వస్తోందని ఆయన చెబుతున్నాడు.
గత 55, 56 ఏళ్లుగా ఈ కేఫ్ నడుస్తోంది. ఇక్కడ రోజుకు దాదాపు 3,000 కప్పుల టీ అమ్ముతారు. ఒక్కో టీ ధర రూ.10 వేసుకున్నా.. రోజుకు రూ.30,000 వరకు వ్యాపారం జరుగుతుంది. అయితే, రోజువారీ ఆదాయం రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుందని ఓనర్ చెబుతున్నారు. దీని ప్రకారం 30 రోజులకు చూసుకుంటే రూ.7.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు కలెక్షన్ వస్తుంది.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇది కేవలం మొత్తం ఆదాయం మాత్రమే. ఇందులో టీ పొడి, పాలు, చక్కెర, పనివాళ్ల జీతాలు, అద్దె, కరెంటు బిల్లులు అన్నీ పోను మిగిలిందే అసలైన లాభం.