టాటా టియాగో VS మారుతి వ్యాగన్ ఆర్.. ఈ రెండిట్లో ఏ కారు బెటర్? ఏది తక్కువ ధర?

Published : Oct 29, 2025, 12:51 PM IST

Tata tiago vs Maruti wagon r: కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి బడ్జెట్లో దొరికే కార్లు టాటా టియాగో, మారుతి వ్యాగన్ ఆర్. అయితే ఈ రెండింటి లో ఏది బెటర్ అని వెతికే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. 

PREV
14
కారు కొనే సమయం ఇదే

కారు కొనడానికి ఇదే ఉత్తమ సమయం. జీఎస్టీ 2.0 తర్వాత కార్ల ధరలు చాలా వరకు తగ్గాయి. ఒక్కొక్క కారుపై 72,000 రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల దాకా తగ్గింపు వస్తోంది. మీరు తీసుకున్న కారును బట్టి ఆ తగ్గింపు ధరలు ఆధారపడి ఉంటాయి. అయితే మధ్య తరగతి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న కార్లు టాటా టియోగో లేదా మారుతి వ్యాగన్ ఆర్. ఈ రెండింటి కార్లు ధరలు కూడా చాలా తక్కువ. అయితే ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనే సందేహం ఎక్కువ మందిలో ఉంది.

24
ఈ కార్ల ధరలు ఇవే

జిఎస్టి 2.0 కొత్త నియమాలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. దీంతో కార్లపై ఉండే పన్ను 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు. దీంతో చిన్న కార్ల ధరలే చాలా వరకు తగ్గాయి. ఇక చిన్న కార్లలో మారుతి వ్యాగన్ ఆర్, టాటా టియాగో వంటివి ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. మారుతి వ్యాగన్ ఆర్ ధర జిఎస్టి తగ్గింపు తర్వాత 4.98 లక్షల రూపాయలుగా ఉంది. ఇక టాటా టియాగో ప్రారంభ ధర 4.57 లక్షలు రూపాయలుగా ఉంది. ఈ రెండు కార్లు కూడా ఐదు లక్షల రూపాయలలోపే అందుబాటులో ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు కూడా వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

34
రెండు కార్ల ఫీచర్స్

టియాగో సిఎన్జి మోడల్ 75.5 PS పవర్, 96.5Nm టార్క్ తో వస్తుంది. దీని బూట్ స్పేస్ అంటే లగేజీలు పెట్టుకునేందుకు దాదాపు 242 లీటర్ల స్పేస్ తో వస్తోంది. ఇక వ్యాగన్ ఆర్ 1.0L, 1.2L పెట్రోల్ వేరియంట్లతో అందుబాటులో ఉంది. దీని CNG కారు మైలేజీ కూడా ఎక్కువే. దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది. అలాగే వ్యాగన్ ఆర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం కూడా ఎక్కువే.

44
రెండింట్లో ఏది బెటర్?

రెండింటిలో టాటా టియాగో ధర, మైలేజ్ కూడా చవకగానే ఉంటుంది. దీన్ని వాడకం చాలా సులువు. అయితే విశ్వసనీత కారణంగా ఎక్కువ మంది వ్యాగన్ ఆర్ ను ఇష్టపడుతూ ఉంటారు. జీఎస్టీ తగ్గింపు తరువాత ఈ రెండు కార్లు కూడా చిన్న కుటుంబాలకు బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ధర తక్కువగా, మైలేజ్ ఎక్కువగా కావాలంటే టాటా టియాగోను ఎంపిక చేసుకోవడం మంచిది. అయితే ధర రెండింటికి చాలా తక్కువ తేడానే ఉంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories