వావ్‌.. టాటాసుమో మళ్లీ వచ్చేస్తోంది.. ఫీచర్లు తెలిస్తే, ఫిదా అవ్వాల్సిందే.

First Published | Jan 8, 2025, 3:36 PM IST

1990లో టాటా సుమో కారు ఓ సంచలనం. ఇప్పుడైతే మార్కెట్లో ఎస్‌యూవీలు సందడి చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం టాటా సుమోలదే హవా ఉండేది. ఎక్కువ మంది ప్రయాణించాలంటే ఈ కారుకే మొగ్గు చూపే వారు. అయితే ఇప్పుడు ఈ లెజండరీ కారు మళ్లీ వస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌ మోడల్‌తో టాటా సుమోను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.. 
 

Tata Sumo Extreఈ తరం వారికి టాటా సుమో పేరు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ 90ల్లో వారికి కచ్చితంగా ఈ కారు గురించి తెలిసే ఉంటుంది. పది మంది సీటింగ్ కెపాసిటీతో వచ్చిన ఈ కారుకు అప్పట్లో భారీగా ఆదరణ ఉండేది. 1994లో తొలిసారి టాటా మోటార్స్‌ ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం మూడేళ్లలోనే ఏకంగా లక్షకుపైగా కార్లు అమ్ముడుపోయి అప్పట్లో సంచలం సృష్టించింది. అయితే ఆ తర్వాత 2002లో సుమో+ పేరుతో కొత్త వాహనాన్ని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు టాటా సుమో నుంచి కొత్త కారు అందుబాటులోకి రానున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 
me

ఇప్పటి వరకు ఈ కారుకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట ఈ కారుకు సంబంధించి ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. ఈసారి టాటా సుమోను అత్యాధునిక ఫీచర్లతో అదిరిపోయే లుక్‌తో ఫార్చునర్‌ వంటి దిగ్గజాలకు పోటీగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా. అది కూడా కేవలం రూ. 9 లక్షల ప్రారంభ ధరతో టాటా ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 
 


2025 మిడిల్‌ లేదా చివరి నాటికి ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కారులో 2.2 లీటర్‌ 4 సిలిండర్‌ డీజిల్‌, 1.5 లీటర్‌ 3 సిలిండర్‌ డీజిల్‌ ఇంజన్‌తో కూడిన రెండు వేరియంట్‌లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్‌ లేదా 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
 

ఇక ఈ కారు ఇంటీరియర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాలమైన క్యాబిన్‌ను ఇవ్వనున్నారని సమాచారం. అలాగే లాంగ్‌ డ్రైవింగ్‌ల కోసం సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందించనున్నారు. ప్రీమియం అనుభూతిని పొందేందుకు సాప్ట్‌ టచ్‌ మెటీరియల్‌తో కూడిన స్టైలిష్‌ డాష్‌బోర్డ్‌ను ఇవ్వనున్నారని టాక్‌. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీలు అయిన ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లేకి సపోర్ట్ చేసే 9 ఇంచెస్‌తో స్క్రీన్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. 
 

డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను ఇందులో అందించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. అలాగే భద్రత విషయంలో కూడా ఈ కారులో పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే డ్యూయల్‌ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగ్‌లు, మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఈబీడితో కూడిన ఏబీఎస్‌, మెరుగైన క్రాష్‌ భద్రత కోసం బలమైన స్టీల్‌ బాడీ, పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను అందించనున్నట్లు సమాచారం. 
 

ధర విషయానికొస్తే.. 

ఇక ధర పరంగా చూస్తే.. సుమో బేసిక్‌ మోడల్‌ ఎల్‌ఎక్స్‌ఐ ధర రూ. 9.5 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే సుమో వీఎక్స్‌ఐ మోడల్‌ దర రూ. 10.5 లక్షలు, సుమో జెడ్‌ఎక్స్‌ఐ ధర రూ. 11.5 లక్షలు, సుమో జెడ్‌ఎక్స్‌ఐ+ ధర రూ. 12.5 లక్షలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

Latest Videos

click me!