హోండా 7జీ వచ్చేస్తోంది.. 75 కి.మీల మైలేజ్‌తో పాటు, స్మార్ట్‌ ఫీచర్లతో..

First Published | Jan 8, 2025, 11:28 AM IST

భారత ఆటోమొబైల్‌ రంగంలో హోండా స్కూటీలకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డుపై పది వాహనలు వెళ్తుంటే అందులో 5 కచ్చితంగా యాక్టివా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా హోండా 7జీ స్కూటీ లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.. 
 

ప్రముఖ టూ వీలర్‌ సంస్థ హోండా భారత మార్కెట్లోకి కొత్త స్కూటీనీ లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. హోండా 7జీని ఈ ఏడాది మిడిల్‌లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ స్కూటీ గేమ్‌ ఛేంజర్‌ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్‌కు సంబంధించి నెట్టింట కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. యాక్టివా 7జీ స్కూటీని స్లిమ్‌ లుక్‌లో డిజైన్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. 
 

ఈ స్కూటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డేటైమ్‌ రన్నింగ్‌ లైట్‌ సిగ్నేచర్‌ ఆల్‌ ఎల్‌ఈడీ సెటప్‌ను అందించనున్నారు. యాక్టివా సిరీస్‌లో అలాయ్‌ వీల్స్‌తో వస్తున్న స్కూటీ ఇదే కావడ విశేషం. ఇది స్కూటీకి స్పోర్టివ్‌ లుక్‌ను అందించనుంది. ఈ స్కూటీలో 125 సీసీతో కూడిన ఫ్యూయల్‌ ఇంజెక్ట్‌, లిక్విడ్‌ కూల్డ్ ఇంజన్‌ను అందించనున్నారు. ఈ ఇంజన్‌ 7500 ఆర్‌పీఎమ్‌ వద్ద 9.3 బీహెచ్‌పీ, 5,500 ఆర్‌పీఎమ వద్ద 10.3 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. మైలేజ్ విషయానికొస్తే ఈ స్కూటీ గరిష్టంగా లీటర్ కు 75 కి.మీలు ఇస్తోందని తెలుస్తోంది. 
 


ఈ స్కూటీలో ఐడల్‌ స్టార్టప్‌ టెక్నాలజీని అందించనున్నారు. అంతేకాకుండా మహిళలు సైతం ఉపయోగించేలా తక్కువ బరువుతో తీసుకొస్తున్నారు. అలాగే గుంతల్లో ప్రయాణించినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా షాక్‌ అబ్జార్బర్స్‌ను అందించనున్నారు. ఇందులో ఏబీఎస్‌కతో కూడిన కంబైన్డ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన బ్రేకింగ్‌ను పొందొచ్చు. ట్రాక్షన్‌ కంట్రోల్‌ వర్షపు నీటిలో కూడా స్కూటీ రోడ్లపై జారకుండా ఉంటుంది. 

టెక్నాలజీకి పెద్ద పీట..

యాక్టివా 7జీలో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 'హెచ్ కనెక్ట్‌' యాప్‌ ద్వారా స్కూటీని ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో కాల్‌/మెసేజ్‌ నావిగేషన్‌, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ వంటివి పొందొచ్చు. ఈ స్కూటీలో ఎనో, నార్మల్‌, స్పోర్ట్‌ వంటి మూవు రైడింగ్‌ మోడ్‌లను అందించారు. వాయిస్‌ కమాండ్‌ ద్వారా సీట్‌ ఓపెన్‌, ఇంజన్‌ స్టార్ట్‌ వంటివి చేయొచ్చు. యూసబీ పోర్ట్‌ సదుపాయం కూడా అదించనున్నారు. అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ను 22 లీటర్లుగా అందించనున్నారు. 
 

ధర విషయానికొస్తే..

హోండా 7జీ స్కూటీని మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. వీటిలో మొదటిది బేసిక్‌ మోడల్‌ ధర రూ. 79,999 ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌గా ఉండనుంది. ఇక డీలక్స్‌ విషయానికొస్తే రూ. 85,999 ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌, ప్రీమియం వేరియంట్‌ ధర ర. 92,999గా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 

Latest Videos

click me!