ఆధార్ కార్డులో పేరు అప్‌డేట్ చేయడానికి ఎన్ని ఛాన్సులో తెలుసా?

First Published | Nov 15, 2024, 2:11 PM IST

మీకు తెలుసా? ఆధార్ కార్డుని కూడా ఎక్కువ సార్లు అప్డేట్ చేయడానికి వీల్లేదు. ఆధార్ అప్డేషన్ కి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. లైఫ్ టైమ్ లో కొన్నిసార్లే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. అసలు ఆధార్ లో మార్పులు ఎన్నిసార్లు చేయవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇది ఎంతముఖ్యమైన డాక్యుమెంట్ అంటే ఏ చిన్న పని చేయాలన్నా ఆధార్ కంపల్సరీ అయిపోయంది. సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవడానికి, పాస్ పోర్ట్ పొందడానికి ఇలా ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఇన్ని ఉపయోగాలున్న ఈ ఆధార్ కార్డును UIDAI జారీ చేస్తుంది. 

ఇంత ముఖ్యమైన ఆధార్‌ కార్డులో సమాచారం తప్పుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆ తప్పులుంటే వెంటనే సరిచేసుకోవాలి.

చాలామంది ఆధార్ కార్డుల్లో కామన్ గా కనిపించే తప్పులేంటంటే.. పుట్టిన తేదీ, పేరు, ఫోన్ నెంబర్, చిరునామా. ఇలాంటివి తప్పులుంటే అప్డేట్ చేయవచ్చు. myAadhaar పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లోనే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉచితంగానే అప్డేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 

మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో ఆధార్ అప్డేట్ చేస్తారు. లేదా అన్ని బ్యాంకుల్లోనూ ఆధార్ అప్డేషన్ కి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల్లో వీటిని ఎప్పుడూ నిర్వహిస్తారు. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రత్యేక సందర్భాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. 


ఆధార్ కార్డులో చాలా మార్పులు చేయవచ్చు. కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. పేరు మార్చడానికి రెండు సార్లే  అవకాశం ఇస్తారు. ఒకవేళ మీరు మూడో సారి కూడా పేరు మార్చుకోవాలనుకుంటే UIDAI అనుమతి తీసుకోవాలి. పేరు ఎందుకు మారుస్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి.

అడ్రస్ మార్చుకోవడానికి ఎలాంటి పరిమితి లేదు. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి కనుక తరచూ చిరునామా మార్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల  ఎన్నిసార్లైనా మార్చుకోవడానికి UIDAI అవకాశం కల్పించింది. 

మీ ఆధార్ కార్డులో మార్పులు కోరుతూ మీరు ఇచ్చిన అప్లికేషన్ ను UIDAI 30 రోజుల్లోనే ప్రాసెస్ చేస్తుంది. అంటే నెల రోజుల్లోనే ఆధార్ అప్డేట్ చేస్తుంది. ఒక వేళ 90 రోజులు దాటినా మీ ఆధార్ అప్డేట్ కాకపోతే మీరు కంప్లయింట్ చేయవచ్చు. 1947 నంబర్ కి కాల్ చేసి మీ వివరాలు చెప్పి కంప్లయింట్ చేయొచ్చు.  లేదా UIDAIని ఆన్ లైన్ లో గాని, డైరెక్ట్ ఆఫీసుకు వెళ్లి అధికారులను సంప్రదించవచ్చు.

మీరు ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్లు దాటిపోయిందా? అయితే మీ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని UIDAI కోరుతోంది. ఇప్పటికే చాలాసార్లు ఆధార్ అప్డేషన్ కి అవకాశం ఇచ్చింది. 14 డిసెంబర్ 2024 లోపు ఆన్ లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని సూచించింది. మీరు ఇంకా అప్డేట్ చేసుకోపోతే వెంటనే చేయించుకోండి. 

Latest Videos

click me!