ఆన్‌లైన్ హెల్త్‌కేర్ లో టాటా డిజిటల్ భారీ పెట్టుబడి.. త్వరలోనే మరో సూపర్ యాప్ రానుందా..?

First Published Jun 10, 2021, 2:28 PM IST

 టాటా సన్స్ యాజమాన్యంలోని టాటా డిజిటల్ లిమిటెడ్ ఆన్‌లైన్ హెల్త్‌కేర్ స్టార్టప్ 1 ఎంజి టెక్నాలజీస్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఒప్పందం పై ఆర్థిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 

టాటా డిజిటల్ ఇటీవల ఫిట్‌నెస్ కేంద్రీకృత క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో కూడా సుమారు రూ.550 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఇటీవల దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ కిరాణా సంస్థ అలీబాబా-మద్దతుగల బిగ్ బాస్కెట్‌లో కూడా వాటాను కొనుగోలు చేసింది.
undefined
ఈ తరుణంలో 1ఎం‌జిలో టాటా పెట్టుబడి డిజిటల్ ఈకో సిస్టమ్ ని సృష్టించేందుకు టాటా గ్రూప్ కి అనుగుణంగా ఉందని కంపెనీ తెలిపింది. టాటా డిజిటల్ ఈ-ఫార్మసీ, ఈ-డయాగ్నస్టిక్స్, టెలి-కన్సల్టేషన్ ఈకో సిస్టంలో ముఖ్యమైన విభాగాలు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి.
undefined
ఇ-ఫార్మసీలో టాటారతన్ టాటా సంస్థ టాటా డిజిటల్ సిఇఒ ప్రతీక్ పాల్ ఒక ప్రకటనలో "1 ఎంజిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఇ-ఫార్మసీ, ఇ-డయాగ్నొస్టిక్ లో మంచి కస్టమర్ అనుభవం, అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు లభిస్తాయి. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవలను అందించడంలో టాటా సామర్థ్యం బలోపేతం అవుతుంది అని అన్నారు. 1ఎం‌జి సహ వ్యవస్థాపకుడు అండ్ సి‌ఈ‌ఓ ప్రశాంత్ టాండన్ మాట్లాడుతూ టాటా పెట్టుబడి సంస్థ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు.
undefined
టాటా డిజిటల్-క్యూర్‌ఫిట్ డీల్దీనికి ముందు టాటా డిజిటల్ క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో 75 మిలియన్ డాలర్లు (సుమారు రూ .550 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. కానీ ఈ పెట్టుబడి ద్వారా ఎంత వాటాను పొందుతుందో కంపెనీ పేర్కొనలేదు.
undefined
టాటా డిజిటల్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకుడు అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముఖేష్ బన్సాల్ టాటా డిజిటల్‌లో ఎగ్జిక్యూటివ్ పాత్రలో అధ్యక్షుడిగా చేరనున్నారని అలాగే క్యూర్‌ఫిట్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్పారు. విశేషమేమిటంటే టాటా డిజిటల్ ఇ-కామర్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ రిటైల్ వంటి దిగ్గజాలతో కంపెనీ పోటీ పడుతుంది.
undefined
click me!