Fronx CBG: ఏంటీ.. పశువుల పేడతో ఈ కారు నడుస్తుందా?

Published : Feb 04, 2025, 04:51 PM IST

Fronx CBG: ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు చూశాం. ఇటీవల సీఎన్ జీ, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఎక్కువగా చూస్తున్నాం. కాని ఇక్కడున్న కారు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ కారు ఆవు పేడ నుండి తయారైన బయో గ్యాస్‌తో నడుస్తుంది. ఇటీవల భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ కారు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి.

PREV
15
Fronx CBG: ఏంటీ.. పశువుల పేడతో ఈ కారు నడుస్తుందా?

EV, CNG, హైబ్రిడ్ వాహనాలతో పాటు కొత్త తరహా వాహనం భారతీయ ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించింది. సుజికి కంపెనీ తయారు చేసిన ఈ కారు పశువుల పేడ ద్వారా తయారైన బయో గ్యాస్‌తో నడిచే కొత్త ఇంజిన్‌ను కలిగి ఉంది. పర్యావరణాన్ని రక్షించడానికి ఇలా వ్యవసాయ, పాడి పరిశ్రమల వ్యర్థాలను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించడం ఎంతో మంచి విషయం. Fronx CBG వేరియంట్ గా మార్కెట్ లోకి రానున్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

25

కంప్రెస్డ్ బయోమీథేన్ గ్యాస్

భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన Fronx CBG వేరియంట్ బయో గ్యాస్‌తో నడిచే కొత్త ఇంజిన్‌ను కలిగి ఉంది. కంప్రెస్డ్ బయో గ్యాస్ అంటే శుద్ధి చేసిన వ్యర్థాల నుండి తయారైన గ్యాస్ అన్నమాట. దీనిని వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. Fronx CBG ఈ కేటగిరీకి చెందని వెహికల్. ఇది కేవలం కంప్రెస్డ్ బయో మీథేన్ గ్యాస్ ను ఉపయోగించి మాత్రమే నడవదు. ఇందులో CNG మాడ్యూల్ కూడా ఉంది. అంటే CNG, CBG రెండింటితోనూ పనిచేస్తుంది.

35

పర్యావరణాన్ని రక్షించడానికి చాలా కంపెనీలు పొల్యూషన్ లేని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG), ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నాయి. అంతేకాకుండా సీఎన్ జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో విపరీతమైన పోటీ కూడా నెలకొంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో నడిచే వాహనాలు తయారు చేసే ఆటో మొబైల్ కంపెనీలు కూడా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికల్ వెర్షన్స్ తయారు చేస్తూ మార్కెట్లో గట్టి పోటీనిస్తున్నాయి. 

ఇటీవల Suzuki కంపెనీ కూడా CNG కార్లకు ఇంధనంగా ఆవు పేడ నుండి ఉత్పత్తి అయ్యే బయో గ్యాస్‌ను ఇంధనంగా ఉపయోగించే ఇంజన్లు తయారు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ప్రకటించింది.

45

పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం

కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుజుకి చేస్తున్న ప్రయత్నమే కంప్రెస్డ్ బయో గ్యాస్(CBG)తో నడిచే వాహనాల తయారీ. ఈ బయో గ్యాస్‌ను ఉపయోగించి CNG వాహనాలకు శక్తినివ్వవచ్చని సుజుకి తెలిపింది. ఈ వాహనాలను ఇండియా మార్కెట్‌తో పాటు ఆఫ్రికా, జపాన్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని కంపెనీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి Honda City Apex: రూ.13 లక్షలకే హోండా సిటీ ప్రీమియం సెడాన్

55

బయో గ్యాస్ నియంత్రణ, ప్రాసెసింగ్ కోసం కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి సుజుకి 2022లో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్స్ వచ్చినట్టే త్వరలో సీబీజీ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా వస్తాయన్న మాట. 

అంచనా మైలేజ్

కార్బన్ న్యూట్రాలిటీ సాధించడానికి సుజుకి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త విధానం ఉంది. బయో గ్యాస్ ధర కిలోకు రూ.90 ఉంటుందని, CNG కార్ల మైలేజ్ మాదిరిగానే కిలోకు 20 నుండి 25 కి.మీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

click me!

Recommended Stories