New Currency: రూ.10, రూ.20 నాణేలపై కేంద్రం కీలక ప్రకటన!

Published : Feb 04, 2025, 03:55 PM IST

New Currency: 10, 20 రూపాయల నాణేలు, నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.  

PREV
15
New Currency: రూ.10, రూ.20 నాణేలపై కేంద్రం కీలక ప్రకటన!

ఈ మధ్య కరెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రూ.500 నోట్లు నకిలీవి మార్కెట్ లోకి వచ్చాయని, అందువల్ల ఆర్బీఐ వాటిని బ్యాన్ చేస్తోందని వార్త వైరల్ అయ్యింది. అదేవిధంగా రూ.350 నోట్లు ఆర్బీఐ ప్రింట్ చేస్తోందన్న విషయం బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి అనేక వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. 

25

సోషల్ మీడియా పోస్టులపై ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ స్పందించాల్సి వస్తోంది. ఎందుకుంటే కొందరేమో ఫేక్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని, పెద్ద నోట్ల రద్దు మళ్లీ చేయబోతున్నారని ఇలంటి ఆందోళనకు గురిచేసే వార్తలకు ప్రజలు కంగారు పడుతున్నారు. అందుకే ఆర్బీఐ నేరుగా స్పందించి నిజానిజాలు బయటపెడుతోంది. 

35

ఇలాంటి అనేక సందర్భాల్లో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మంత్రులు, ఇతర సిబ్బంది స్పందించి ఫేక్ నోట్ల చలామణి, కొత్త కరెన్సీ ప్రింటింగ్ తదితర విషయాల గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో చెప్పారు. 

ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భమే మళ్లీ వచ్చింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 10, 20 రూపాయల నాణేలు, నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.

45

ఈ విషయంపై క్లారిటీ దొరికింది. రూ.10 నోట్లు, నాణేలు చెలామణిలోనే ఉంటాయని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా రూ.10 నోట్లు, నాణేలు అవసరమైతే మరికొన్ని ప్రింట్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.20 నోట్ల ముద్రణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది. 

సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు కోరుతున్నారు. కరెన్సీకి సంబంధించి ఎలాంటి విషయమైనా అధికారికంగా ప్రకటన వస్తుందని, ఆ వార్తలు మాత్రమే నమ్మాలని కోరారు. 

55

అంతే కాకుండా రూ. 20 నాణెం వివరాలను కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే చెలామణిలో ఉన్న రూ.10 నాణెంలాగే రూ.20 నాణెం కూడా తయారు చేయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. మరి కొత్త రూ.20 నాణెం మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. 

click me!

Recommended Stories