Business Idea: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియా.. నెలకు రూ. 30 వేల సంపాదన.. అదేంటంటే..

Published : Apr 08, 2026, 02:00 PM IST

Business Idea: వేసవి కాలంలో విద్యార్థులు తమకున్న మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, కోడింగ్ లేదా చెస్ వంటి నైపుణ్యాలను ఇతరులకు నేర్పించడం ద్వారా నెలకు 30,000 నుండి 50,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. 

PREV
15
స్టూడెంట్స్ కోసం సమ్మర్ బిజినెస్ ఐడియాస్

డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి పై చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు వేసవి సెలవులు ఒక గొప్ప అవకాశం. ఈ మూడు నెలల సమయాన్ని వృధా చేయకుండా, తమకున్న నైపుణ్యాలను వ్యాపారంగా మార్చుకోవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు

25
నైపుణ్యాలే మీ పెట్టుబడి:

చాలా మంది విద్యార్థులకు చదువుతో పాటు సంగీతం, నృత్యం(కూచిపూడి, భరతనాట్యం), పెయింటింగ్, గిటార్ వాయించడం లేదా చెస్ వంటి వాటిలో ప్రవేశం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకైతే కోడింగ్, మెషిన్ డిజైనింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు ఉంటాయి.

35
శిక్షణ ఇవ్వడం ద్వారా..

ఈ నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే చిన్న పిల్లలు, ఆసక్తి గల వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారు. వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

45
డోర్ డెలివరీ సర్వీస్ మోడల్:

నేటి కాలంలో పేరెంట్స్ తమ పిల్లలను కోచింగ్ సెంటర్లకు పంపడం, మళ్ళీ తీసుకురావడం వంటి పనులను భారంగా భావిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా విద్యార్థులే నేరుగా కస్టమర్ల ఇంటికి వెళ్లి (Home Tutoring) శిక్షణ ఇవ్వవచ్చు. ఉదాహరణకు, మ్యూజిక్ నేర్పించే వారు ఒక్కో విద్యార్థి నుండి నెలకు 6,000 నుండి 10,000 వరకు చార్జ్ చేస్తున్నారు. కేవలం ఐదుగురు విద్యార్థులకు నేర్పించినా నెలకు 50,000 రూపాయల వరకు సంపాదించడం సులభం.

55
ప్రమోషన్, వృద్ధి:

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా పేజీ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్‌మెంట్లలో చిన్న డెమోలు ఇవ్వడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఇది కేవలం ఆదాయమే కాకుండా, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి, భవిష్యత్తులో సొంతంగా బిజినెస్ ప్రారంభించడానికి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది. తమ ఐడియాలను మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియని వారు నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా మరింత వేగంగా ఎదగవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories