సోమవారం నష్టాలకు బ్రేక్.. నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..

Ashok Kumar   | Asianet News
Published : Dec 21, 2021, 05:28 PM IST

సోమవారం భారీ పతనంతో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు మంగళవారం రెండో ట్రేడింగ్ రోజున  లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 497 పాయింట్లు (0.89 శాతం) లాభంతో 56,319.01 వద్ద ముగియగా అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 156.65 పాయింట్లు (0.94 శాతం) జంప్‌తో 16,770.85 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్ 498 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది.  

PREV
13
సోమవారం నష్టాలకు బ్రేక్.. నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..

ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 1064 పాయింట్లు పెరిగి 56,819కి చేరుకుంది. ఈ పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు పెరిగింది. టాటా స్టీల్‌ స్టాక్‌ ఈరోజు 5 శాతం వరకు పెరిగింది. ఇవాళ షేర్ మార్కెట్‌లో రెండు సూచీలు లాభాలతో ట్రేడయ్యాయి. ట్రేడింగ్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 520.78 పాయింట్లు (0.93 శాతం) పెరిగి స్వల్ప సమయంలో 56,342.79కి చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్ కూడా 153.90 పాయింట్లు (0.93 శాతం) పెరిగి 16,768.10 స్థాయికి చేరుకుంది. రోజు గడిచేకొద్దీ బుల్లిష్ ట్రెండ్ కొనసాగింది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 725 పాయింట్ల గరిష్ట స్థాయిని నెలకొల్పి 56,540.10 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్ 201.85 పాయింట్లు (1.21 ) శాతం జంప్‌తో 16,816.05 వద్ద ఉంది. ఉదయం 11 గంటల వరకు సెన్సెక్స్ 905 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 268 పాయింట్ల లాభంతో గ్రీన్ మార్క్‌లో ట్రేడయ్యాయి.

23

విశేషమేమిటంటే, సోమవారం, సెన్సెక్స్ 1,190 పాయింట్ల భారీ పతనంతో 56 వేల దిగువకు పడిపోయింది, నిఫ్టీ కూడా 371 పాయింట్లు కోల్పోయింది. ఈరోజు సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్ లాభాలతో ట్రేడవుతున్నాయి. 
 

33

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.60 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, యుపిఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు ఎక్కువ లాభపడితే.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సీప్లా, ఎస్‌బీఐ షేర్లు ఎక్కువ నష్టపోయాయి. రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఎనర్జీ, ఐటీ, మెటల్ సూచీలు 1-3 శాతం పెరగడంతో మార్కెట్ లాభాల్లో ముగిసింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి.

click me!

Recommended Stories