ఒమిక్రాన్‌ భయాలు: భారీ నష్టాల నుంచి ఊరటనిచ్చిన స్టాక్ మార్కెట్‌..

Ashok Kumar   | Asianet News
Published : Dec 21, 2021, 11:29 AM IST

సోమవారం భారీ పతనంతో ముగిసిన స్టాక్ మార్కెట్.. నేడు మంగళవారం ట్రేడింగ్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది. బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్ 498 పాయింట్ల లాభంతో ప్రారంభం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. 

PREV
13
ఒమిక్రాన్‌ భయాలు: భారీ నష్టాల నుంచి ఊరటనిచ్చిన  స్టాక్ మార్కెట్‌..

. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, సెన్సెక్స్ 520.78 పాయింట్లు (0.93 శాతం) పెరిగి 56,342.79 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్ కూడా 153.90 పాయింట్లు (0.93 శాతం) పెరిగి 16, 768.10 స్థాయికి చేరుకుంది. రోజు గడిచేకొద్దీ బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది అలాగే సెన్సెక్స్ గరిష్టంగా 725 పాయింట్ల వరకు సెట్ చేసింది. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 718.09 పాయింట్లు (1.29 శాతం) లాభంతో 56,540.10 స్థాయి వద్ద ట్రేడవుతోంది. 

23

 మరో వైపు  నిఫ్టీ ఇండెక్స్ 201.85 పాయింట్లు (1.21 శాతం) జంప్‌తో 16,816.05 స్థాయి వద్ద ట్రేడవుతోంది. విశేషమేమిటంటే, సోమవారం సెన్సెక్స్ 1,190 పాయింట్ల భారీ పతనంతో 56 వేల దిగువకు పడిపోయింది.
 

33

మార్కెట్‌లో నిఫ్టీ-సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌గా టైటాన్‌ కంపెనీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, విప్రోలు.. నిఫ్టీలో టాప్‌ లాసర్స్‌గా సిప్లా, హీరో మోటర్‌కాప్‌, ఎయిచర్‌ మోటర్స్‌, ఉన్నాయి.  

ఐసీఐసీఐ, రిలయన్స్‌, బజాజ్‌ఫైనాన్స్‌, టాటామోటార్స్‌, విప్రో లాభాల బాటలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్‌లో సానుకూల ప్రభావం, దేశీయ కంపెనీల భారీ ఒప్పందాల నడుమ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల పట్టినట్లు నిపుణులు చెప్తున్నారు.

 

Read more Photos on
click me!

Recommended Stories