భూమి అంతం అవుతుందా? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు ఇవిగో

First Published Nov 3, 2024, 3:19 PM IST

బ్రిస్టల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు షాకింగ్ సమాచారాన్ని వెల్లడించారు. భూమి అంత్య దశకు చేరుకుంటోందని.. మానవులు, జంతువులతో సహా అన్ని జీవులూ నశించిపోతాయని వారు అంచనా వేస్తున్నారు. వారి పరిశోధనల్లో వెల్లడైన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

ఇటీవలి సంవత్సరాలలో సంభవించిన అనేక భూకంపాలను, వాటి కారణాలను సైన్టిస్టులు విశ్లేషించారు. ఆ లెక్కలను అంచనా వేస్తూ భూమి వినాశనానికి దగ్గరవుతోందని వారంతా భావిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ అనుకున్న దాని కంటే వేగంగా పెరుగుతోందని భయంకరమైన నిజాన్ని తెలిపారు. 

మానవులు, జంతువులతో సహా ఏ జీవి భూమిపై మనుగడ సాగించలేని పరిస్థితి భవిష్యత్తులో రానుందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఇది భూమి పూర్తి వినాశనానికి దారితీస్తుందని చెబుతున్నారు. ఈ సమాచారం బ్రిస్టల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ సాంకేతికతను ఉపయోగించి చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

Latest Videos


250 మిలియన్ సంవత్సరాల క్రితం సేమ్ ఇలాగే భూమి ఇలాగే జీవం లేకుండా తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. అదే మాదిరిగానే భవిష్యత్తులో వినాశకరమైన వరద సంభవిస్తుందని అంచనా వేస్తున్నారు. భూమిపై ఉన్న జీవరాశులన్నీ తుడిచిపెట్టుకుపోతాయని శాస్త్రవేత్తల పరిశోధనా నివేదిక సూచిస్తోంది.

భూమి ఉష్ణోగ్రత భవిష్యత్తులో 70 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని వారి పరిశోధనలో తేలింది. దీనివల్ల ఏ జీవి కూడా మనుగడ సాగించడం అసాధ్యమని చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అన్ని జీవులూ అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. 

66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్‌ల వినాశనానికి దారితీసిన ఇలాంటి సంఘటనను వారు గుర్తు చేశారు. పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు భూమిని నాశనం చేస్తాయని వారి పరిశోధన సూచిస్తోంది.

పరిశోధన బృంద నాయకుడు అలెగ్జాండర్ ఫార్న్స్‌వర్త్ తెలిపిన వివరాల ప్రకారం కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు రెట్టింపు అయ్యాయి. భవిష్యత్తులో భూమి ఖండాలు పాంగేయా అల్టిమా అనే సూపర్ ఖండంలో విలీనం అవుతాయి. అగ్నిపర్వతాలు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయని, శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తాయని మరియు క్రమంగా భూమిని నిర్జీవంగా మారుస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు

click me!