అలాగే తేనె ఉత్పత్తిని జరిగిన తర్వాత వాటిని ప్యాకింగ్ అలాగే మార్కెటింగ్ చేసేందుకు ఓ ప్రత్యేకమైన గోడౌన్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. తద్వారా మీరే మీ సొంత బ్రాండ్ ను ఏర్పాటు చేసుకొని తేనెను నేరుగా సూపర్ మార్కెట్లు కిరాణా షాపుల్లోనూ విక్రయించవచ్చు. ఇందుకోసం నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలో ఓ షాపును అద్దెకు తీసుకొని రిటైలర్లకు విక్రయిస్తే మంచిది. మంచిది. అప్పుడు మీ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. మీ ఆదాయం పెరిగే కొద్దీ తేనెటీగల ఫార్మ్ ల సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పని వాళ్ళ సంఖ్యను కూడా పెంచుకోవాలి.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.